Take a fresh look at your lifestyle.

ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశాను : ఎమ్మెల్యే యెన్నం

0 14

ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశాను : ఎమ్మెల్యే యెన్నం
నిర్దేశం, హైదరాబాద్ :
ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ వల్ల నేను ఒక బాధితుడి గా బాధపడినా. ఫోన్ ట్యాపింగ్ నాపై కూడా జరిగింది. ఎస్ఐబీ అధికారులు ప్రశ్నించే గొంతులపై ఫోన్ ట్యాపింగ్ ప్రయోగించింది. రాజకీయకంగానే కాకుండా , వ్యాపారవేత్తల దగ్గర డబ్బులు కొల్లగొట్టేందుకు ఈ ట్యాపింగ్ ను వాడుకున్నారు. గత పదేళ్ల నిర్బంధ పాలన జరిగింది. ఉమ్మడి రాష్ట్రం కంటే … తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ నిర్భందాలు జరిగాయి. ఎన్నికల సమయంలో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు.
మహబూబ్ నగర్ కు చెందిన మాజీ మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసి , కాల్ రికార్డులు మళ్ళీ వారికి పంపించారు. వాటి ఆధారంగా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. ఈరోజు ఆధారాలతో సహా డీజీపీ కు ఫిర్యాదు చేశాను. రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ కు ఈ ఫోన్ ట్యాపింగ్ విఘాతం కలిగించింది. కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ బాధితులు లేరు. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి బాధితులు ఉన్నారు. ప్రతి జిల్లాకు ఒక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేస్తే బాధితులు బయటకు వస్తారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking