Take a fresh look at your lifestyle.

హోళి పండుగ అంటే…

0 17

హోళి పండుగ అంటే…

హోలీ అనేది సంస్కృత పదం. వసంత కాలంలో వచ్చే ఈ పండుగను ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ లో హిందువులు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకుంటారు. హిరణ్య కశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. విష్ణువును పూజించడం మాన్పించేందుకు హిరణ్య కశిపుడు ప్రహ్లాదుణ్ని ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తాడు. ఈ హోళి పండుగ గురించి మరో కథనం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కామదహనం అంటే ఏమిటి ? కామదహనం ఎందుకు జరుపుకోవాలి. హోలీ పండుగ రోజు రంగు లను ఎందుకు చల్లుకోవాలి…? ఔను.. చాలా మందికి హోళి పండుగ గురించి తెలియదు.
భౌతిక కామ వాంఛలన్నీ తగలబెట్టి, ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం యొక్క పరమార్ధం. మన భారతీయ హిందూ సాంప్రదాయ, ఆచార వ్యవహారాలలో పండుగలు అనేవి ఆయా పర్వదినానికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఉంది.
తిధి, నక్షత్ర రోజులలో తెలుగు నెలల ఆధారంగా వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది పునారావృతం అవుతుంది. ఒక ప్రత్యేకమైన పండుగను అదే ప్రత్యేకమైన రోజునాడు ఎందుకు జరుపు కోవాలి అనేది జ్యోతిష ఆధారంగా తెలుస్తుంది.
ప్రస్తుత హోలీ పండగ అనేది ఎప్పుడు, ఏలా జరుపుకోవాలి అనే విషయంలో ధర్మసింధు, నిర్ణయ సింధు మొదలగు ప్రామాణిక గ్రంధాల ఆధారంగా వివరణ పరిశీలించి చూడగా కామదహనం అనేది పాల్గుణ మాస, పౌర్ణిమ రోజు చేయాలని నిర్ణయం చేసారు. అందుకే కాముని పున్నమి అనే పేరు వచ్చింది. ఈ పండగను యావత్ భారత దేశ ప్రజలు అన్ని ప్రాంతల వారు ఆనందంగా జరుపుకుంటారు.
పురాణ గ్రంథాల ఆధారంగా చూడగా కామ దహనం.. పార్వతి దేవి పరమ శివుడిని వివాహం చేసుకోవడానికి సహయంగా శివుని తపస్సును భంగ పరచమని కామ దేవుడిని అడుగుతుంది. అప్పుడు కామదేవుడు ఆ తపస్సులో ఉన్నశివుడి ఏకాగ్రతను భంగం పరచడానికి అతనిపై పూలబాణం వదులుతాడు. తన తపస్సుకు భంగం కల్గించింది ఎవరా? అని ఆ పరమశివుడు తన త్రీనేత్రం దివ్యదృష్టితో చూడగా అది కామదేవుడని గ్రహించి తన ముక్కంటిని తెరిచి కామదేవుడి శరీరాన్ని భస్మం చేస్తాడు. కామదేవుని భార్య రతిదేవి పరమ శివుడికి వద్దకెళ్లి వేడుకోగా తిరిగి కామ దేవుడిని బతికిస్తాడు.
శివుడి కామాన్ని దహించిన సంఘటనకు ప్రతీకగా కామదహనం చేయడమనే ఆచారం నేటికి కొనసాగుతు వస్తుంది. సహేతుకంగా గమనిస్తే మనిషిలోని కోరికలను దహింపజేసుకుని మానసిక ఆరోగ్యాన్ని పెంపోందించుకోవాలనేదే ఈ పండగ లోని అంతరార్ధం. రంగులు చల్లుకోవడంలో ఆంతర్యం.. హిరణ్య కశిపుడి చెల్లెలు అయినా హోలిక రాక్షసి చనిపోవడం వల్ల ఆమె బాధల నుంచి విముక్తి అయినందుకు సంతోషంగా రంగులు చల్లు కొని తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తు హోలిక మహోత్సవాన్ని ఆనాడు రఘు మహారాజు రాజ్యంలోని ప్రజలు జరుపుకున్నారు.
ఆహోలిక మహో త్సవం నాటి నుంచి నేటివరకు కొనసాగిస్తు ప్రజలు ఒకరిపై మరోకరు రంగులు చల్లుకొని ఆనందోత్సవాల మధ్య హోలీ సంబురాలను జరుపుకుంటున్నారు. కాముడుని పరమేశ్వరుడు భస్మీపటలం చేయడంలో అంతర్లీనంగా మానవజాతికి ఒక సందేశం కనబడుతుంది. కాముడు ప్రతీ మనిషిలోను అదృష్య రూపంలో అంతట వ్యాపించి ఉంటాడు. ప్రతి మనిషిలో అంతర్లీనంగా దాగి ఉన్న అరిష్డ్వర్గాలైన రాగ, ద్వేష, కామ, క్రోధ, మోహ, మాయ మొదలగు గుణాలను ప్రజ్వరిల్లకుండా అను నిత్యం అదుపు చేసుకుని మనస్సుని అధీనంలో పెట్టుకోవాలని సందేశం కనబడుతుంది.
మనిషిలో కోరికలు గుర్రంలా స్వారీ చేస్తే మనిషి భ్రష్టు పట్టి పోతాడు.మనిషిలోని రజో,తామస గుణాలను పారదోలి, సాత్విక గుణంతో జీవిస్తే మనిషి జన్మకు సార్ధకత లభిస్తుంది.

– సోషల్ మీడియా

Leave A Reply

Your email address will not be published.

Breaking