Take a fresh look at your lifestyle.

మరీ ఇంత నీచమా? మాయావతిపై సినీ నటుడి కులోన్మాద వ్యాఖ్యలు

మాయావతి దళిత కమ్యూనిటీకి చెందినవారు. దేశ దళిత సమాజం మాయావతిని తమ నాయకురాలిగా చూస్తారు. పైగా యూపీకి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.

0 340
  • దళితులైతే టాయిలెట్లు కడగాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్
    కేఆర్‭కేను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు

రాజకీయాల్లో గెలుపు-ఓటములు సర్వసాదారణం. నిన్నటి వరకు 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ నేడు 11 సీట్లకు పడిపోయింది. 60 ఏళ్ల నుంచి దేశాన్ని ఏళిన కాంగ్రెస్.. 100 సీట్లు దాటలేకపోతోంది. వీటిపై విమర్శ-ప్రతివిమర్శలు అనేకం ఉంటాయి. కానీ, వెనుకబడిన కులాల వారికి ఇది వర్తించదు. ఇతరుపై వచ్చే విమర్శలు, వెనుకబడిన కులాలకు ముఖ్యంగా దళిత రాజకీయ నాయకుల మీద వచ్చే విమర్శలు వేరుగా ఉంటాయి. చాలా సందర్భాల్లో కులోన్మాదం బహిరంగంగానే కనిపిస్తుంటాయి. బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి విషయంలో ఇది తరుచూ రుజువు అవుతూనే ఉంటుంది.

తాజా లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ దారుణ ఓటమి పాలయ్యింది. ఓటమి కారణాలేమైనప్పటికీ విమర్శకుల మాటలు పదును ఎక్కాయి. ఎవరికి తోచిన తీరున వారు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇదే అదనుగా సినీ నటుడు కమ్ క్రిటిక్ మహ్మద్ రషీద్ కమాల్ (అలియాస్ కేఆర్‭కే) చాలా దారుణమైన పదజాలంతో కులోన్మాద వ్యాఖ్యలు చేశాడు. మాయావతిని టాయిలెట్లు కడగమని, ఆమె అర్హత అంతే అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు. అతడికి ట్విట్టర్(ఎక్స్)లో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

మాయావతి దళిత కమ్యూనిటీకి చెందినవారు. అలాగే దేశంలో పారిశ్యుద్ధ పని చేసేది దళితులే. ఆ కోణంలోనే అతడు ఈ నీచమైన వ్యాఖ్యలు చేశాడు. దేశ దళిత సమాజం మాయావతిని తమ నాయకురాలిగా చూస్తారు. పైగా యూపీకి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అత్యంత దిగువ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆమె అంతపెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తిపైనే ఇంతటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే.. సమాజంలో, రాజకీయాల్లో కుల వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో మిగతావారు రాణించనట్టుగా దళితులు, ఇతర వెనుకబడిన వర్గాల వారు రాణించలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. కాగా, బీఎస్పీ కార్యకర్తలు సహా ఇతరులు కేఆర్‭కేను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking