డబ్బులకు ఓట్లు అమ్మొద్దు..
పెద్దపల్లిలో వినూత్న ప్రచారం
నిర్దేశం, పెద్దపల్లి :
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఇండిపెండెంట్ అభ్యర్థి మోత నరేష్ వినూత్న ప్రచారం నిర్వహించారు. మద్యానికి, డబ్బులకు అమ్ముడు పోయి ఓటర్లు ఓటు వేసి తమ ఐదు సంవత్సరాల బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మెడలో ఖాళీ బీరు సీసాలు, వంద రూపాయల నోట్లు మెడలో వేసుకుని వినూత్న ప్రచారం నిర్వహించాడు పెద్దపల్లి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి మోత నరేష్.