Take a fresh look at your lifestyle.

కరీంనగర్ లో సాగు నీటి కష్టాలు

0 4

కరీంనగర్ లో సాగు నీటి కష్టాలు
– హైదరాబాద్ లో ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్
నిర్దేశం, కరీంనగర్:
ఉమ్మడి ‌కరీంనగర్ జిల్లాలొ రోజురోజుకి సాగునీటి‌ కష్టాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ‌వరిపంట చేతికి వచ్చే సమయంలో నీరులేక పంటలు ఎండిపోతున్నాయి.మరో పది రోజులు‌ అయితే పంటంతా చేతికి వచ్చేది. కానీ..ఒకేసారి భూగర్భ జలాలు‌ అడుగంటి పోయాయి. ఓ వైపు ఎండలు తీవ్రం కాగా.. మరోవైపు‌ భూగర్భ ‌జలాలు అడుగంటి పోయాయి. ప్రధాన‌ ప్రాజెక్టుల్లో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరింది. చేతికి ‌వచ్చిన పంటలన్ని కళ్ళముందు ఎండిపోతుండడం తో రైతులు తట్టుకోవడం లేదు.చివరకు వాటర్ ట్యాంకర్ల ద్వారా‌ నీటిని తరలించి పంటని కాపాడుకునే చివరి ప్రయత్నం చేస్తున్నారు అన్నదాతలు. ఎల్లంపల్లి జలాశయం భానుడి భగభగలకు ఆవిరవుతోంది. ఎత్తిపోతలు లేక కాళేశ్వరం జలాలు తిరిగొచ్చే దారిలేక.. దిగువ ప్రాంతాలకు‌ తాగునీళ్లు ఇవ్వలేనంటూ చేతులెత్తేస్తోంది.

మరో వైపు ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు భారీగా పడిపోతుండటంతో సాగునీటి గండాన్ని మోసుకొస్తోంది. కడెం ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరువైంది. ఉమ్మడి ‌కరీంనగర్ జిల్లాలొ రోజురోజుకి సాగునీటి‌ కష్టాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ‌వరిపంట చేతికి వచ్చే సమయంలో నీరులేక పంటలు ఎండిపోతున్నాయి.మరో పది రోజులు‌ అయితే పంటంతా చేతికి వచ్చేది. కానీ..ఒకేసారి భూగర్భ జలాలు‌ అడుగంటి పోయాయి. దీనితో బావులు, బోరులు ఎండిపోతున్నాయి. అదే విధంగా ‌అయకట్టు‌ కూడ‌ సరిగా కెనాల్‌లో నీరు రావడం ‌లేదు. ఈ క్రమంలో పదిహేను రోజుల నుంచి రైతులు‌ నానా తంటాలు‌ పడుతున్నారు. ముఖ్యంగా మొగ్దుంపూర్, దుర్శేడ్ గ్రామాలైతే నీరు‌ ఉన్న చోటు నుండి ట్యాంకర్ల ద్వారా‌ నీటిని తీసుకువచ్చి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా వరద కాలువ సమీపంలో‌ సాగుచేస్తున్న పంటలకు సరిగా సాగునీరు‌ రావడం‌లేదని రైతులు రోడ్లేక్కుతున్నారు రైతులు. కేవలం‌ రెండు తడులు అయితే ‌పంటలు చేతికి‌ వస్తాయని రైతులు‌ నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.
హైదరాబాద్ లో తాగు నీటి కొరత
నగరంలోని భూగర్భ జలాలు అడుగంటిపోయి. ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒకటి రెండు షిఫ్టులలో సరఫరా సరిపోవట్లేదు. ఈ నేపథ్యంలో జలమండలి సమస్య నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే కొత్తగా 20 ఫిల్లింగ్ స్టేషన్లు , మూడో షిఫ్ట్ ఏర్పాటు చేసింది. అదనపు ట్యాంకర్లు, డ్రైవర్లను సమకూర్చుకుంటున్నట్లు ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిశోర్ సూచన మేరకు జీహెచ్ఎంసీ నుంచి 200 మంది డ్రైవర్లను సమకూర్చు కుంటున్నామని.. దీనికి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ కూడా అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ డ్రైవర్లకు నేడు జలమండలి ప్రధాన కార్యాలయంలో ఒక రోజు ఓరియెంటెషన్ ప్రోగ్రాం నిర్వహించారు. వీరంతా మూడో షిఫ్ట్ రాత్రి సమయాల్లో వాణిజ్య వినియోగదారులకు నీరు సరఫరా చేసేందుకు పనిచేయనున్నారు.ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మూడో షిఫ్ట్ ప్రారంభమైంది. కమర్షియల్ ట్యాంకర్లు బుక్ చేసుకున్న వినియోగదారులకు నీటి సరఫరా చేస్తున్నారు.

నిన్న ఒక్కరోజే 800 ట్రిప్పులుగా ట్యాంకర్లతో నీరు అందించారు. అంతే కాకుండా.. కొన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో అదనపు ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు కొత్త డ్రైవర్ల రాకతో, రాత్రి వేళల్లో ట్రాఫిక్ సమస్య తక్కువగా ఉండటంతో వినియోగదారులకు జలమండలి మరిన్ని సేవలు అందించనుంది. మరో వైపు రాత్రి వేళల్లో ట్యాంకర్లు బుక్ చేసుకోవాలని వాణిజ్య వినియోగదారులకు జలమండలి విజ్ఞప్తి చేస్తోంది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్ డైరెక్టర్లు స్వామి, విజయరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking