హరీశ్ రావు కు కరోనా పాజిటివ్
- కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్న హరీశ్
- టెస్టులో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
- కాంటాక్ట్ లోకి వచ్చిన వారు టెస్టులు చేయించుకోవాలన్న హరీశ్
తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనలో కొన్ని కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నానని… రిపోర్టులో తనకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు తెలిసిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని చెప్పారు. తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరూ ఐసొలేషన్ లో ఉండాలని, కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. మరోవైపు, ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు కరోనా బారిన పడ్డారు. తాజాగా హరీశ్ కు కూడా కరోనా సోకడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి.
Tags: Harish Rao, TRS, Corona Virus