Take a fresh look at your lifestyle.

నేడే ఎన్నికల నగారా

0 14

నేడే ఎన్నికల నగారా

– షెడ్యూల్ ప్రకచించనున్న సీఈసీ

న్యూఢిల్లీ, 
ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శనివారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ట్వీట్ చేసింది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌భీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌లను ఇటీవల నియమించగా.. వీరు శుక్రవారం ఉదయం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈసీ వారికి అభినందనలు తెలియజేశారు. కాగా, ఇటీవల అరుణ్ గోయల్‌, అనూప్ చంద్ర పాండే రాజీనామాతో కమిషనర్ల పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని నియమించింది. అనంతరం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్‌, పంజాబ్‌కి చెందిన సుఖ్‌భీర్ సింగ్ సంధుని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆరుగురి పేర్ల పరిశీలన అనంతరం వీరిని ఎంపిక చేయగా.. వెను వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి నియామకానికి ఆమోద ముద్ర వేశారు.ప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది..లోక్‌సభతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించేందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమైంది.. ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం టీమ్ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించింది. మొత్తం 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ పోల్స్ జరిగే అవకాశమున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ ఉన్నాయి..a

Leave A Reply

Your email address will not be published.

Breaking