పోలీసుల చొరవతో పసిపాప క్షేమం
కరీంనగర్ మాతా శిశు హాస్పిటల్ లో ఆదివారం జరిగిన పసికందు కిడ్నాప్ ఘటనను పోలీసులు చేధించారు. కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ కు చెందిన నిర్మల ఈ నెల 16 వ తేదిన ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆదివారం ఆ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుపోయారని హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, టాస్క్ ఫోర్స్, స్పేషల్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీలు, టెక్నికల్ ఎవిడెన్స్లను పరిశీలించి నిందితురాలిగా తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ముక్కెర కవితగా గుర్తించారు. గ్రామానికి వెళ్లి ఆమెతోపాటు శిశువును కుడా అదుపులోకి తీసుకున్నారు. పసికందును క్షేమంగా తల్లి దగ్గరకు చేర్చారు