Take a fresh look at your lifestyle.

అవినీతిపై ఏసీబీ సీరియస్

0 19

అవినీతిపై ఏసీబీ సీరియస్
– ఏసీబీ వలలో పడ్డ ఆర్టీసీ డిపో మేనేజర్
– లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై..
– 18 వేలు లంచంతో డ్రగ్ ఇన్ స్పెక్టర్ సోమశేఖర్ అరెస్ట్
నిర్దేశం, హుజూరాబాద్ : తెలంగాణ ప్రాంతంలో అవినీతికి పాల్పడిన ముగ్గురు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండ్ గా అరెస్టు చేశారు. వ్యూహం ప్రకారం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యండ్ గా అరెస్ట్ చేయడం విశేషం.

ఆర్టీసీలో అవినీతి చాలా తక్కువే. విధుల నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే సిబ్బంది వద్ద లంచాలు తీసుకునే అధికారులు అరుదు. కానీ.. హుజూరాబాద్ డిఫోకు చెందిన డ్రైవర్ తాటికొండ రవీందర్ కు వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యండ్ గా దొరికారు డిపో మేనేజర్ శ్రీకాంత్. విధులను నిర్లక్షం చేస్తున్నారని భావించిన డిఎం శ్రీకాంత్ డ్రైవర్ రవీందర్ కు చార్జీ మెమో ఇచ్చారు. ఆ చార్జీ మెమో ఎత్తివేయడానికి 30 వేలు డిమాండ్ చేశారు డిఎం. అయితే.. 10 వేలు ఇచ్చిన డ్రైవర్ ను మిగతా 20 వేలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు డిఎం. అయితే.. విసుగు చెందిన డ్రైవర్ రవీందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

సోమవారం ఎల్కతుర్తిలోని ఓ హోటల్ లో 20 వేలు లంచం తీసుకుంటుండగా డిఎం శ్రీకాంత్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండ్ గా పట్టుకున్నారు.
మరో కేసులో అసిఫాబాద్ ఎస్ ఐ రాజ్యలక్ష్మీ స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 40 వేలు లంచం డిమాండ్ చేయగా.. రూ. 25వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. అలాగే నల్లగొండ డ్రగ్ ఇన్ స్పెక్టర్ సోమశేఖర్ ప్రైవేటు హాస్పిటల్ ఫార్మసీ మంజూరీ చేసేందుకు రూ. 18వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఒకే రోజు ఏసీబీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు చోట్ల రైడ్లు నిర్వహించి లంచం తీసుకుంటున్న అధికారులను పట్టుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking