Take a fresh look at your lifestyle.

వైసీపీలోకి గంటా చేరికపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

0 83
  • వైసీపీలోకి రావాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలి
  • ఇది వైసీపీ సిద్ధాంతం
  • పార్టీ ఆశయాలకు అనుగుణంగా జగన్ నిర్ణయం తీసుకుంటారు

టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ గూటికి చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటూ విజయసాయి అన్నారు. వ్యక్తుల కోసం తమ పార్టీ సిద్ధాంతాలను మార్చలేమని అన్నారు.

వైసీపీలోకి ఎవరైనా రావాలనుకుంటే ముందుగా రాజీనామా చేయాలనేది పార్టీ సిద్ధాంతమని విజయసాయి చెప్పారు. జగన్ సుపరిపాలనను చూసి వైసీపీలో చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నారని అన్నారు. అయితే పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. విజయసాయి వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి. గంటా చేరికను విజయసాయి తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
Tags: Vijayasai Reddy, Jagan YSRCP, Ganta Srinivasa Rao, Telugudesam

Leave A Reply

Your email address will not be published.

Breaking