ఆ 75 లక్షల సొమ్మును మాయం చేసిన పోలీసులెవరు..?

0

 పోలీస్ స్టేషన్ లో సొమ్ములు మాయం

చేసిన ఇంటి దొంగలెవరు..?

కర్నూల్, మార్చి 30 (వైడ్ న్యూస్) దొంగతనం జరిగితే పోలీసులు వచ్చి ఆ దొంగలను పట్టుకుంటారు. ఇది అందిరికి తెలిసిన నిజం. కానీ.. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ లో దొంగల నుంచి రికవరి చేసిన  రూ. 75 లక్షల సొత్తు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

2021 జనవరి 28వ తేది రాత్రి కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద ఎస్ఈబి సీఐ లక్ష్మీ దుర్గయ్య వాహనాలు తనిఖీ చేపట్టారు. హైదరాబాదు వైపు నుంచి వస్తున్న తమిళనాడుకు చెందిన కారును ఆపి తనిఖీ చేయగా శాతన భారతి, మణికందన్ అనే ఇరువురు వ్యాపారుల వద్ద నుంచి 105 కిలోల వెండి ఆభరణాలు, రూ.2.05 లక్షల నగదును గుర్తించారు.

వీటికి సంబంధించి ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో తనిఖీ అధికారులు సొత్తును సీజ్ చేసి అప్పటి కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ విక్రమ్ సింహాకు అప్పగించారు. వాణిజ్య పన్నుల శాఖకు గాని, ఆదాయ పన్నుల శాఖకు గాని అప్పగించలేదు.  పోలీస్ అధికారులు సదరు సొత్తును పోలీస్ స్టేషన్ లోని బీరువాలో ఉంచారు. అయితే.. రికవరి చేసిన ఆ సొత్తు పోలీస్ స్టేషన్ నుంచి మాయమైన విషయాన్ని పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. ఇంటి దొంగల పనే అంటున్నారు అధికారులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking