ఉద్యమకారునికి ఆర్థిక సహాయం
నిర్దేశం, జగిత్యాల :
తెలంగాణ ఉద్యమకారుడు జేఏసీ కన్వీనర్ ఎన్నమనేని శ్రీనివాస్ రావు అనారోగ్యంతో బాధపడుతూ, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయాన్ని గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ పోస్టును చూసి స్పందించి వెంటనే ఎన్నమనేని శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి ఆర్థిక సహాయం చేసి అందజేశారు. ప్రభుత్వంతో అన్నివిధాల సహాయ సహకారాలు అందడానికి కృషి చేస్తా అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే ఉద్యకారులకు చేయూత అందించేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేర్కొన్నారు.