Cm Revanth Reddy: సినీ ప్రముఖుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

ఈ రోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భాంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య థియేటర్ వద్ద ఏర్పడిన ఘటన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సినీ పెద్దలతో తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నారంటే..

సినిమా పరిశ్రమ సమస్యలను మా ద్రుష్టి కి తెచ్చి అనుమానాలు, అపోహలు, ఆలోచన లను పంచుకున్నారు. 8 సినిమా లకు మా కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ జీవో లు ఇచ్చాం, పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చాం. తెలుగు సినిమా పరిశ్రమ కు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకున్నాం.   ఐటీ, ఫార్మా తో పాటు తెలుగు సినిమా పరిశ్రమ కూడా మాకు ఎంతో ముఖ్యం… తెలంగాణ లో నటులకు అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, సినిమా పరిశ్రమ కు మధ్యవర్తి గా ఉండానికి ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ను తెలంగాణ ఎఫ్ డిసి ఛైర్మన్ గా నియమించాం.

సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తాం అట్లాగే తెలుగు పరిశ్రమ కూడా కమిటీ ని ఏర్పాటు చేసుకోవాలి…

తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్ కు రెండు గంటలల్లో రావొచ్చు, తెలంగాణ లోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి. ముంబైలో వాతావరణం కారణం గా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ. హాలివుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతాం…

హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నాం. పరిశ్రమను నెక్ట్ప్ లెవల్ కు తీసుకెళ్లడమే మా ఉద్దేశం. గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలి. సినిమా పరిశ్రమ కు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి..

సినిమా స్టూడియోలకు స్థలాలు, నిర్మాణాలు, నివాస స్థలాలు, ఫిల్మ్ నగర్, చిత్రపురి కాలనీ, కార్మికులకు ఇండ్లు, ఇతర సౌకర్యాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం. సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన భాద్యత నాది అంతే గాని నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలుగు సినిమా పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అన్ని భాషల సినిమాల నిర్మాణానికి అంతా కలిసి అభివృద్ధి చేద్దాం…మా ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది. సినిమా పరిశ్రమ కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తు పెట్టుకోవాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు సినీ ప్రముఖుల సమావేశంలో చెప్పారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!