ఉద్ధం మీరో యుద్ధం

నా కల నెరవేరింది! నన్నేం చేసుకున్నా నాకు సమ్మతమే.
నేను మరణం కు భయపడను నా దేశం కోసం మరణిస్తాను.
జలియన్వాలాబాగ్ హంతకుడుని 21 ఏళ్లు వెతికి వెతికి చంపిన యుద్ధ వీరుడు డయ్యార్ ను కాల్చి చంపి లండన్ లో అరెస్ట్ అయిన తర్వాత పోలీసులతో అన్న మాటలు ఇవి.
తధానంతరం పొద్దున్నుంచి బ్రిటిష్ చట్టం ప్రకారం బ్రిటిష్ గడ్డపైన ఉరి తీయబడ్డాడు.

“ఈ హత్య నేనే చేశాను నేను మాత్రమే చేశాను. ఎందుకు అంటే, అతని మీద నాకు పగ నేను అతనిని చంపే అంత తప్పు చేసాడు నా దెశ ప్రజల ఆత్మ గౌరవాన్ని భంగపరచాడు అందుకనే వాడిని చంపి వేసాను అందుకోసం 21 సం!! లు వేచి చూసాను, నేను ఈ పని చేసినందుకు సంతోషంగా ఉన్నాను నేను చావుకు భయపడలేదు. నేను నా దేశం కోసం మరణిస్తున్నాను
నేను బ్రిటీష్ పాలనలో భారతదేశంలో ఆకలితో ఉన్న నా ప్రజలను చూశాను ఈ విషయంలో నేను ఎంతో భాదను, దుఃఖాన్ని అనుభవించాను, అందుకే నా బాధ్యత గా నా మాతృభూమి కోసం నా మరణం కన్నా నాకు ఏది ఎక్కువ గౌరవం ఇవ్వబడదు,

ఇవి కోర్టులో ఉద్దం సింగ్ మాట్లాడిన మాటలు.
భారదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఉద్దం సింగ్ మాత్రమే ఇలా కోర్టు ముందు గర్వంగా ఒప్పుకుని అమరులయ్యారు. ఎక్కువుగా గుర్తింపు పొందిన సావర్కర్ లాంటివాళ్ళు కూడా ప్రాణాభిక్షకు ప్రాధేయపడగా ఉద్దం దేశం కోసం సంతోషంగా ప్రాణాలర్పించి, ప్రాణాలు అర్పిస్తున్నందుకు గర్వపడటం గమనించగలం.

ఉద్ధం జెనరల్ మైకెల్ ఓ డయ్యర్ను చంపినందుకు ఈ ప్రపంచానికి తెలిశాడు, ఈ డయ్యరే జలియఁవాలాబాగ్ హత్యాకాండకు సూత్రధారి. ఉద్దమ్ సింగ్ తన పేరును రాం మొహమ్మద్ సింగ్ ఆజాద్ గా, భారతదేశంలోని మతాలైన హిందూ, మొహమ్మదీయ, సిక్కు మతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ, మార్చుకున్నాడు.
ఆరోజుల్లో దేశభక్తులు అందరూ ఎదో ఒక మతానికి పరిమితమై అదే జాతీయభావనగా చెప్పుకునేవారు. ఇతడి త్యాగానికీ, దేశభక్తికీ మెచ్చుకొని ఇతడిని షహీద్-ఎ-అజం (వీరులలో అగ్రుడు) గా వ్యవహరిస్తారు. 20వ శతాబ్దపు మొదట్లో భగత్ సింగ్, రాజ్‍గురు, ఇంకా సుఖదేవ్తో పాటుగా ఉద్దమ్ సింగ్ ని కూడా తీవ్రవాద స్వాతంత్ర్య సేనానులుగా ప్రకటించారు అలానే అనుకున్నారు . బ్రిటిష్ ప్రభుత్వం వీరిని ఆనాడే భారతదేశపు మొదటి బహుజన యోధులుగా పేర్కొనింది. 1940 మార్చి 13న జలియన్ వాలా బాగ్ సంఘటనకు ప్రతీకారంగా ఉద్దం సింగ్ లండన్ కాక్స్‌టన్‌ హాల్‌లో మైకేల్ ఓ డయ్యర్‌ని కాల్చి చంపి, లొంగిపోయాడు.

ఒక అనాధగా పెరిగిన ఉద్దం దేశంపాట్ల తనకున్న ప్రేమను, ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడం ద్వారా బహుజన వీరుడయ్యాడు . అమెరికాలో గద్దర్ పార్టీలో సభ్యుడిగా తర్వాత HSRA (హిందూస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అస్సిసిపోషన్ లో క్రియాశీల సభ్యుడిగా ఉండి, జలియన్ వాలాబగ్ ఉదంతంలో బ్రిటిష్ కు వ్యతిరేకపోరాటంలో అరెస్ట్ అయ్యారు. తర్వాత జర్మనీ వెళ్లి అక్కడినుండి బ్రిటన్ వెళ్లి అక్కడ డయ్యర్ ను కాల్చి చంపి, నవ్వుతూ, నడుచుకుంటూ ఠీవిగా వెళ్లి లొంగిపోయారు. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకుని కోర్టులో అప్పజెప్పినప్పుడు దేశంకోసం చంపాను అని ప్రకటించి, దేశ ప్రజల్లో విప్లవ బీజాలు నాటిన వీరుడు. ఎటువంటి ప్రచారము, గుర్తింపు,విగ్రహాలు నెలకొల్పబడని ఒక బహుజనుల బిడ్డ,. 1909 ఏప్రిల్ లో వందేమాతరం ఉద్యమ కాలంలో ఆంద్రప్రదేశ్ లో తెనాలి బాంబ్ కేసులో చెన్నయ్య అనే బహుజన బిడ్డ రైల్ పట్టాలపై బాంబ్ పేల్చే ప్రక్రియలో చనిపోతాడు. ఈ విషయాన్ని ఇలా రాయకుండా, చెన్నయ్యకు ప్రఖ్యాతలు రాకుండా కుల సమాజం జాగ్రత్తలు తీసుకుంది. అప్పటికప్పుడు రామయ్య, బసవయ్య అనే ఆధిపత్య కుల వ్యక్తుల పేర్లు పత్రికల్లో అచ్చయ్యాయి. వీరిద్దరినీ అరెస్ట్ చేయగా టంగుటూరి ప్రకాశం పంతులు కేసు వాదించి వీరిద్దరిని విడుదల చేయించాడు. ఆంద్రప్రదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో మూక దాడులు కాకుండా తక్కువమంది వ్యక్తులతో జరిగిన విధ్వంస కేసుల్లో కనీసం జరిమానా కూడా శిక్ష పడకుండా తప్పించుకున్న వ్యక్తులు వీరిద్దరే. ఎందుకలా జరిగింది ? జవాబు సులువుగా చెప్పొచ్చు…వారు అసలా ప్రాంతంలోనే లేరు అని ప్రకాశం పంతులు వాదించారు, బ్రిటిష్ పోలీస్ ఎంక్విరీలో కూడా అదే తేలింది కాబట్టి కేసు కొట్టేశారు, పేరు కూడా కొట్టేశారు. చరిత్ర గ్రంధాల్లో స్వాతంత్ర్య వీరుడైన చెన్నయ్య పేరును ‘చెన్నడు’ తక్కువ చేసి రాయడం చూస్తే తెలుస్తుంది కులగజ్జి పోరాటాల్లో, గుర్తింపులోనే కాదు చారిత్రక గ్రంధాల్లో కూడా అల్లుకుపోయిందని చెప్పడానికి.

ఎందుకు పై చర్చ జరిగిందని మనం అనుకున్నప్పుడు ఏ సమాజం అయితే అంటరానితనం అనుభవించిందో ఏ సమాజం అయితే అట్టడుగు వర్గాల ఉందో ఆ సమాజం నుండి ఎలాంటి గొప్ప పని చేసిన ఎంత త్యాగం చేసిన కులతత్వపు ఆలోచన కలిగిన సమాజం వారికి ఎలాంటి గుర్తింపును ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా చరిత్రలో పేరు లేకుండా చేస్తూ వస్తూ ఉంది

ఒక వేళ ఉద్ధం సింగ్ నిమ్నజన బహుజన సమాజాన్ని
చైతన్య పరిచే నాయకుడిగా , పోరాటయోధుడిగా :-

జులియన్ వాలా బాగ్ ఉదంతం దేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన అమానుషమైన సంఘటన.

జనల్ డయ్యర్ కాల్చి చంపిన సుమారు వెయ్యి మంది జులియన్ వాలా బాగ్ ప్రాంత వాసులంతా అంటరాని సిక్కులే.

వీళ్ళు తక్కువ స్థాయి సిక్కులన్న వివక్షతో సిక్కు బ్రాహ్మణులు రేపిన చిచ్చు వలన,ఒక తప్పుడు సమాచారంతో, పదుల సంఖ్యలో చిన్నపిల్లలతో సహా వెయ్యి మందిని జనరల్ డయ్యర్ కాల్చి చంపి జులియన్ వాలా బాగ్ ను శవాల గుట్టలుగా మార్చాడు.

ఒక లక్ష్యాన్ని గురి చూడగల వీరుడుగా,ఒక దోపిడీ ఆదిపత్యాన్ని నిలువరించి నిలబడగల బలమైన పోరాటయోధుడుగా పీడిత ప్రజలకు అండగా ఉన్న యుద్ధం, ఉద్ధం సింగ్ అనే యుద్ధం సింగ్, ఒక బ్రిటీష్ వ్యక్తిని చంపాలనే దిగువ స్థాయి టార్గెట్ ను తన జీవిత కాల లక్ష్యం ఏమి కాదు ! కానీ ఏ సమాజాన్ని అయితే నెత్తుటి మడుగులో కాళ్లు చేతులు కోల్పోయి గాయాలపాలై, అహంకారాలు చేస్తూ ఏడుస్తూ, దుఃఖంతో అలమటిస్తున్న సమాజాన్ని చూసి చలించిపోయి నా సమాజం పైన దాడి జరిగితే నా సమాజం కన్నీళ్లు కారిస్తే చూస్తూ ఆత్మగౌరవం లేని మనిషిలా బతక కూడదని. ఒకే ఒక్క ఉద్దేశంతో 21 ఏళ్లు కేవలం పగనే , శ్వాసగా ఆహారంగా తీసుకొని మొత్తం యావత్ బహుజన సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వ చూశాడు, అయితే డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంతో యుద్ధం యొక్క పూర్తి అర్థం ఈ దేశంలో మారిపోయింది బహుజన సమాజం ఈ విషయాన్ని అర్థం చేసుకొని అవసరమైతే ఉద్ధం సింగ్ లాంటి పోరాటపాటిమని అలవర్చుకొని ఒక్క నెత్తుటి చుక్క, ఒక కన్నీటి బొట్టు కార్చకుండా, ఓటు ఆయుధం చేత పట్టుకొని ఈ సమాజాన్ని అయితే అన్యాయానికి ఆకలికి దుఃఖానికి గురి చేస్తున్న ఆధిపత్య కుల మత భావన కలిగిన దుర్మార్గపు పరిపాలనని అంతం చేయడం అసలైన యుద్ధం సింగ్ వారసత్వపు లక్షణం

తన జాతి ప్రజలను చైతన్యశక్తిగా మార్చి వారి సాంఘిక,ఆర్ధిక రాజకీయ స్థితిని స్థిరీకరించే పూలే అంబేడ్కర్ పోరాటాలను గుర్తించకుండా దారి మళ్ళిపోయి, చంపిన వాడిని చంపటమనే తాత్కాలిక ఫలితమైన హింసాత్మక ట్రాక్ లో ప్రయాణించి రాజ్యం చేత చంపబడి భారతీయ పీడిత తాడిత ప్రజలకు ఒక విలువైన బలమైన నాయకుడిని లేకుండా చేసిన యోధుడు సర్ధార్ ఉద్దమ్ సింగ్ అని చెప్పక తప్పదు.

ఉద్ధమ్ సింగ్ జయంతికి బహుజన నివాళులు..

– శర్ధని రాము, ఉస్మానియా యూనివర్సిటీ, ఎంటెక్,
బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!