సిగ‌రెట్ దేవీతో కాన్స‌ర్ కుమార్ పెళ్లి.. నెట్టింట వైర‌ల్ అవుతున్న శుభ‌లేఖ‌

నిర్దేశం, స్పెష‌ల్ డెస్క్ః ఇంత‌కు ముందు పెళ్లి అంటే ఘ‌నంగా జ‌రుపుకోవాల‌నే ఆలోచ‌న ఉండేది. కానీ, ఇప్పుడు పెళ్లి అంటే భిన్నంగా జ‌రుపుకోవాల‌నే మేనియా న‌డుస్తోంది. ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్లు చూస్తున్నారు క‌దా.. బుర‌ద‌లో పొర్లుతూ కూడా తీసుకుంటున్నారు. ఇక పెళ్లిలో శుభ‌లేక కూడా ప్ర‌ధాన‌మైన‌దే. దాన్ని కూడా కొంద‌రు చిత్ర‌విచిత్రంగా త‌యారు చేస్తుంటారు. అయితే, తాజాగా సోష‌ల్ మీడియాలో ఒక శుభ‌లేఖ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇది ప్రజల దృష్టిని విప‌రీతంగా ఆకర్షిస్తుంది.

కార‌ణం, అందులో ఉన్న వ‌ధూవ‌రుల పేర్లు. ఇలాంటి వెడ్డింగ్ కార్డ్‌ని మీరు ఇంతకు ముందు ఎక్కడా చూసి ఉండరు. సిగ‌రెట్ దేవీతో కాన్స‌ర్ కుమార్ పెళ్లి అని కార్డులో ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వెడ్డింగ్ కార్డ్ చూసి నవ్వు ఆపుకోలేరు. ఇది చాలా హెచ్చరిక సందేశంగా కనిపిస్తోంది. ఈ వెడ్డింగ్ కార్డ్ పైన ‘డేంజరస్ మ్యారేజ్ – అమాయ‌క‌ బరాతీ’ అని రాసి ఉంది. వధువు పేరు పక్కన.. దురదృష్టవ‌తి బీడీ కుమారి అలియాస్ సిగరెట్ దేవి. ఇక‌ వరుడి పేరు పక్కన ‘మృతాత్మ క్యాన్సర్ కుమార్’ అలియాస్ ‘లీలాజ్ బాబు’ అని రాసి ఉంది.

వధువు తల్లిదండ్రుల పేరు మిస్టర్ పొగాకు లాల్ జీ, శ్రీమతి సుల్ఫీ దేవి వారి నివాసం 420 యమ్‌లోక్ హౌస్, దుఖ్ నగర్. వరుడి తల్లిదండ్రుల పేర్లు మిస్టర్ గుట్కా లాల్ జీ-శ్రీమతి బంగా దేవి. నివాసం తప్పు దారి అధిక్‌పూర్ (డ్రగ్ స్టేట్). ఈ వింత వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతోంది. @vimal_official_0001 అనే పేజీ ద్వారా Instagramలో షేర్ చేశారు. దీనిపై నెటిజెన్ల‌ నుంచి చాలా ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!