విమోచనం, ప్రజాపాలన.. మధ్యలో నిమజ్జనం

నిజానికి, హైదరాబాద్ ను పాకిస్థాన్ లో విలీనం చేయాలని నిజాం రాజు భావించారు. కానీ, భౌగోళికంగా అది సాధ్యం కాకపోవడంతో విలీనం తప్పలేదు.

0

నిర్దేశం, హైదరాబాద్: సెప్టెంబరు 17 వచ్చిందంటే చాలు.. ఏటా తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఉన్న వైరుద్ధ్యాలు బయటికి వస్తూ ఉంటాయి. సెప్టెంబరు 17ను గుర్తించకుండా వేడుకలకు దూరంగా ఉంటున్నారని ఒక పార్టీ ఆరోపిస్తుంటుంది. మరో పార్టీనేమో ఢిల్లీ నుంచి వచ్చి మరీ తెలంగాణ విమోచన దినాన్ని జరుపుతుంటుంది. గత పదేళ్లుగా తెలంగాణలో ఇదే జరుగుతోంది. అయితే గత ఏడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఈ రెండింటినీ కాకుండా ప్రజాపాలన దినోత్సవంగా పేరు పెట్టి నిర్వహించింది. ఇలా సెప్టెంబరు 17ను వివిధ రాజకీయ పార్టీలు వారి రాజకీయాలకు అనుగుణంగా మార్చేసుకుంటున్నాయి.

సెప్టెంబరు 17 చరిత్ర ఏంటంటే?

సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినం. అంటే 1948కి ముందు ఉన్న హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలిసిన రోజు. దీన్ని విలీనమని ఒకరంటే విమోచనమని ఒకరంటున్నారు. విద్రోహం అనేవారూ లేకపోలేదు. స్వాతంత్ర్యం అనంతరం.. దేశంలోని సంస్థానాలు, స్వతంత్ర రాజ్యాలు భారత యూనియన్ లో కలిసిపోయాయి. హైదరాబాద్, జునాగఢ్, బరోడా, కశ్మీర్ రాజ్యాలు బెట్టు చేశాయి. అనంతరం ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ స్టేట్ ను ఇండియాలో విలీనం చేశారు. నిజానికి, హైదరాబాద్ ను పాకిస్థాన్ లో విలీనం చేయాలని నిజాం రాజు భావించారు. కానీ, భౌగోళికంగా అది సాధ్యం కాకపోవడంతో విలీనం తప్పలేదు.

వినాయకుడు సేఫ్ చేశాడు

ఇక ఈరోజు నిర్వహణపై ప్రతి ఏడాది ఏదో రభస నడుస్తూనే ఉంటుంది. అలా నడుస్తూ వస్తోంది. దీనిపై రాజకీయం కూడా వాడి వేడిగానే సాగుతుంటుంది. కానీ, ఈసారి ఈ రాజకీయానికి దెబ్బ పడినట్టే కనిపిస్తోంది. సరిగ్గా ఇదే రోజున వినాయక నిమజ్జనాలు ఉండడంతో ప్రజలు, మీడియా అటెన్షన్ అంతా అటే పోయింది. కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా మీటింగులు పెట్టినా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇది ఒక రకంగా అధికార పార్టీకే సేఫ్ గేమ్ అని చెప్పాలి. విమోచన దినోత్సవం బీజేపీ చేసే యాగీని తట్టుకోవడం అంత సులువు కాదు. కానీ ఈ పెద్ద బాధ తప్పింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking
Advertisements