అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ విడాకులు!

విభిన్నమైన ఎంట్రీలతో అభిమానులు షాక్ అయ్యారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన విడాకుల పోస్టుకు అభిషేక్ లైక్ కొట్టాడు. దీంతో క్లారిటీ వ‌చ్చేసింది.

0

నిర్దేశం: అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ వివాహ బంధం గురించి వార్త‌లు గుప్పు మంటున్నాయి. ఈ జంట తొంద‌ర‌లోనే విడాకులు తీసుకోనుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అభిషేక్ త‌న‌ కుటుంబంతో మాత్రమే కనిపిస్తుండగా, ఐశ్వ‌ర్య త‌న కుమార్తె ఆరాధ్యతో క‌నిపిస్తోంది. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఐశ్వర్య అందరి దృష్టిని ఆకర్షించింది. కార‌ణం, ఐశ్వర్య వేలికి పెళ్లి ఉంగరం లేదు.

ఐశ్వర్య త‌న కూతురు ఆరాధ్యతో కలిసి సైమా అవార్డ్స్‌కు హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లింది. వీడియోలో, నిర్వాహకులు ఐశ్వర్య ఆమెకు స్వాగతం పలుకుతూ కనిపించారు. ఓ అభిమాని ఐశ్వర్య కోసం పూల గుత్తి తీసుకొచ్చాడు. ఐశ్వర్య చాలా అందంగా కనిపించింది కానీ ఆమె వేలికి పెళ్లి ఉంగరం లేదు.

అభిషేక్ వేలికి కూడా ఉంగరం లేదు

ఐశ్వర్య కంటే ముందే అభిషేక్ త‌న వేలికి ఉన్న పెళ్లి ఉంగ‌రాన్ని తీసేశాడు. ఇంత‌కు ముందు క‌నిపించిన చాలా వీడియోల్లో అభిషేక్ వేలికి పెళ్లి ఉంగరం లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అభిషేక్, ఐశ్వర్యల విడాకుల వార్త చాలా కాలంగా వస్తూనే ఉంది. ఈ జంటకు పెళ్లయి 17 ఏళ్లు అవుతోంది. అభిషేక్ తన కుటుంబంతో కలిసి అనంత్-రాధిక అంబానీల వివాహానికి హాజరుకావడంతో విడాకుల వార్తలు గుప్పుమ‌న్నాయి. ఆ తర్వాత కూతురు ఆరాధ్యతో ఐశ్వర్య స‌ప‌రేటుగా అక్క‌డికి వచ్చింది. విభిన్నమైన ఎంట్రీలతో అభిమానులు షాక్ అయ్యారు. ఆ తర్వాత, సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన విడాకుల పోస్టుకు అభిషేక్ లైక్ కొట్టాడు. దీంతో క్లారిటీ వ‌చ్చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking