భద్రాచలం :రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయుల బదిలీలు ,పదోన్నతులు వెంటనే చేపట్టాలని PRTU జిల్లా అధ్యక్షులు D .వెంకటేశ్వరరావు (DV ),ప్రధానకార్యదర్శి బి .రవి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .బుధవారం స్థానిక PRTU ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సంఘ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మట్లాడారు .ఏండ్లతరబడి పెండింగులో ఉన్న ఉపాద్యాయుల పదోన్నతులు ,బదిలీలు తక్షణమే చేపట్టాలన్నారు .ఉద్యోగులకు బకాయిగాఉన్న పాత DA లను మంజూరి చేసి డిసెంబర్ నెలాఖరులోగా PRC ప్రకటించాలని డిమాండ్ చేసారు .PRC ప్రకటించక పోతే జనవరి మొదటి వారం లో ప్రత్యక్ష పోరాట కార్యాచరణకు తమ సంఘం పూనుకొంటుందని తెలిపారు .PET ,పండిట్ ఉపాధ్యాయులకు అప్ గ్రేడేషన్ ఉత్తర్వులు విడుదల చేయాలనీ కోరారు .ITDA లో సూపర్ న్యూమరీ లో పని చేస్తున్న పని చేస్తున్న టీచర్స్ ని డెప్యూటేషన్ పై కుటుంబ సభ్యులకు దగ్గర చేయాలని కోరారు .ITDA లో దీర్ఘ కాలం గా పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేయాలన్నారు .
పాటశాలలో స్కావెంజర్ లను కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు .కార్యక్రమంలో PRTU జిల్ల్లా అద్యక్షులు డి.వి , ప్రధానకార్యదర్శి రవి ,రాష్ట్రనాయకులు ధనుకొండ శ్రీనివసరావు ,
కె వి రమణ ,నర్సయ్య జిల్లా నాయకులు తన్నీరు శీను ,తోటమల్ల నాగార్జున ,తోటమల్ల సురేష్ ,దేవీసింగ్ ,మోతీలాల్ ,బాసు ,దేవుసింగ్ ,భవాని శేఖర్ ,వెంకట్ తదితరులు పాల్గొన్నారు .ITDA DD ని మర్యాదపూర్వకం గా కల్సిన
PRTU జిల్లా బృందం :ITDA DD గా భాద్యతలను చేపట్టిన రమాదేవిని PRTU జిల్లా నాయకత్వం మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేసింది .ITDA పరిధిలోని సమస్యలపై వినతిపత్రం అందచేసి పరిష్కరించాలని కోరారు.