బోనకల్ : మండలంలోని రాయన్నపేట గ్రామంలో శనివారం ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లి కలకోట ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఛైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు, రాయన్నపేట మరియు కలకోట గ్రామ సర్పంచ్ లు కిన్నెర వాణి, యంగల దయామని తో కలిసి ఉమ్మడిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించటంతో పాటు నేరుగా పొలంలోనే పంటను అమ్ముకునే సౌకర్యం రైతుకు కల్పించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు, కలకోట గ్రామ ఉప సర్పంచ్ హరిత, కలకోట క్లస్టర్ ఏఈవో నాగసాయి, సొసైటీ సిఈఓ మల్లికార్జున్, రైతులు నాగేశ్వరరావు, పాపారావు మరియు సిబ్బంది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ టి.రమేష్