శ్రీకాకుళం, పొందూరు,మండలంలోని కింతలి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్న రన్నింగ్ ట్రాక్ ను ఇటీవల చేపట్టిన నాడు-నేడు పనులు కారణంగా తొలగించటం జరిగింది.ఈ ట్రాక్ ను గత ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి 4 లక్షలు రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం చేయటం జరిగింది.పాఠశాల ఆవరణలో ఉన్న రన్నింగ్ ట్రాక్ పలు ఉద్యోగాల సాధనకు ఎన్నోయేళ్ళుగా యువతకు ఉపయోగపడేది.ఈ రన్నింగ్ ట్రాక్ పునరుద్ధరణ పట్ల సంబంధిత అధికారులు,గ్రామ పెద్దలు ఆలోచించి ఆర్మీ,పోలీసు సెలక్షన్ లు ఈమధ్య ఉన్నందున దయచేసి రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి గ్రామ యువతకు,వాకింగ్ చేసే పెద్దలకు బాసటగా నిలవాలని కోరుకుంటున్నాము..గురుగుబెల్లి వెంకటరావు,
ప్రజానేత్ర – రిపోర్టర్,..