Take a fresh look at your lifestyle.

ఖాకీ డ్రెస్ వేసుకున్నారు.. బ్లాక్ మెయిల్ చేసి కోట్లు ఆర్జించారు..

0 38

ఖాకీ డ్రెస్ వేసుకున్నారు
పోన్ ట్యాపింగ్ తో కోట్లు ఆర్జించిన ‘రావు’ గ్యాంగ్

నిర్దేశం, హైదరాబాద్
పోలీస్.. న్యాయానికి, ధర్మానికి, త్యాగానికి మాత్రమే చిహ్నం కాదు.. శాంతి భద్రతలను రక్షించి ప్రశాంత వాతవరణం కోసం కృషి చేసేవారే పోలీసు. ఇది నిజం.. కానీ, తులసి వనంలో గంజాయి మొక్కల్లా కొందరు ఖాకీ డ్రెస్ వేసుకుని గులాబీకి ఊడిగం చేసి పోలీసు శాఖ పరువు తీసే వారిని సమాజం అసహించుకుంటుంది.

తప్పు చూసినోడు ఎవరైనా తప్పించుకోలేరని పోలీసు అధికారులు చెబుతున్న మాట. ఇగో అన్నీ తెలిసిన ఆ పోలీసు అధికారులే తప్పులు చేసి కటకటాలు లెక్కిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ‘రావు’ల గ్యాంగ్ ఏది చేసినా చెల్లుతుందని భావించి అక్రమంగా ఆస్తులు సంపాదించడానికి అడ్డ దారులు తొక్కి కటకటాలు లెక్కిస్తున్న రావు అధికారులున్నారు. ఫోన్ ట్యాపింగ్ తో ముఖ్యుల ఫోన్ సంభాషణలను రికార్డు చేయించుకుని బ్లాక్ మెయిల్ చేసి కోట్లు ఆర్జించిన సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

చట్టాన్ని రక్షించాల్సిన ఆ పోలీసు అధికారులే ప్రభుత్వ పెద్దలు చెప్పిందే వేదంగా భావించారు. చట్టాన్ని చుట్టంగా మార్చుకున్నారు. అక్రమాలు చేశారు. ఇప్పుడు జైలులో చిప్పకూడు తింటున్నారు. ఖాకీ డ్రెస్ వేసుకుని హీరోల్లా తిరిగిన ఆ పోలీసు అధికారులు దొంగల్లా మీడియాకు మొఖం కనిపించకుండా మాస్ పెట్టుకునే పరిస్థితులు వచ్చాయి.

ఫోన్ ట్యాపింగ్ లో ఎస్ ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్ రావు, మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావులు సూత్రదారులు కాగా ప్రణీత్‌ రావు, భుజంగరావు, తిరుపతన్న పాత్రదారులుగా సాక్ష్యాలతో సిట్ అధికారులకు దొరికి పోయారు. ఒకప్పుడు ఖాకీ డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా రెస్పెక్ట్ ఇచ్చే పోలీసు సిబ్బంది కూడా ఇప్పుడు ఇంటార్ గేషన్ చేస్తూ నిజాలను రాబడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పిన ప్రతి పక్షల నేతల ఫోన్ లను ట్యాపింగ్ చేయడమే కాకుండా రియల్ ఎస్టేట్‌ పెద్దలు.. వ్యాపారులు, హవాలా చేసేవారిని కూడా టార్గెట్ చేసింది ఈ ట్యాపింగ్ రావు గ్యాంగ్. కోట్లు ఆర్జించిందనే ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking