ఆ పోస్ట్ మాస్టర్ కీ.శే. బద్దం లింగయ్య ఇంట్లో నలుగురు డాక్టర్లు..

డీఎంహెచ్ వో గా చెల్లే డాక్టర్ రాజశ్రీ.. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాజీ చైర్మన్ గా అన్న డాక్టర్ మధుశేఖర్

0

ఆ పోస్ట్ మాస్టర్ ఇంట్లో నలుగురు డాక్టర్లే..

  • కూతురు డీఎంహెచ్ వో గా డాక్టర్ రాజశ్రీ..
  • కుమారుడు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాజీ చైర్మన్ గా డాక్టర్ మధుశేఖర్..
  • కోడలు డాక్టర్ నందిత రమాదేవి గైనకాలజిస్ట్..
  • మనుమడు డాక్టర్ జైదీప్ జనరల్ సర్జన్..
  • అల్లుడు దామోదర్ కూడా డాక్టరే..

ఔను.. ఆ పోస్ట్ మాస్టర్ కీ.శే. బద్దం లింగయ్య ఇంట్లో నలుగురు డాక్టర్ లే.. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సౌకర్యాలు లేని సమయంలో కుమారుడు మధుశేఖర్ ను, కూతురు రాజశ్రీలను డాక్టర్ లు గా తీర్చిదిద్దారు.

నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో పోస్టల్ డిపార్ట్ మెంట్ లో జాబ్ చేస్తూ లింగయ్య గ్రామీణ ప్రాంతాలలో వైద్యం కోసం ప్రజలు పడే బాధలను స్వయంగా చూశారు. ప్రజలు గౌరవించే వైద్య వృత్తిలో తన పిల్లలు రాణిస్తుంటే మురిసి పోయారు తల్లిదండ్రులు లక్ష్మీ-లింగయ్యలు.

ఆర్థికంగా తాము ఇబ్బందులు పడుతూనే తమ ఇద్దరు పిల్లలకు ఉన్నత వైద్య విద్యను అందించారు. అయినా.. ఇప్పుడు ఆ పోస్ట్ మాస్టర్ లింగయ్య భౌతికంగా లేరు.. కూతురు డీఎంహెచ్ వో గా డాక్టర్ రాజశ్రీ.. కుమారుడు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాజీ చైర్మన్ గా డాక్టర్ ప్రత్యక్షంగా చూడలేక పోయారు తండ్రి లింగయ్య. కానీ.. ఆయన ఆశయం మాత్రం ఆ ఇంట్లోని డాక్టర్ లలో కనిపిస్తోంది.

  డాక్టర్ రాజశ్రీ, డీఎంహెచ్ వో, నిజామాబాద్ 

డాక్టర్ రాజశ్రీ.. నిజామాబాద్ డిఎంహెచ్ వో గా విధులు నిర్వహిస్తున్నారు. కన్నతండ్రి లింగయ్య కోరిక మేరకు సొంత అన్నయ్య డాక్టర్ మధుశేఖర్ ను స్పూర్తిగా తీసుకుని ఆమె ఎంబిబిఎస్ చదివారు. ఆ తరువాత డెర్మటాలజిస్ట్ గా ప్రజలకు వైద్య సేవలు అందించారు. వైద్య సేవలకు నోచుకొని ఆదిలాబాద్ జిల్లా సోనాల అటవి ప్రాంతంలో గవర్నమెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు వైద్య సేవలందించారు. ఆ తరువాత చాలా కాలం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేశారు డాక్టర్ రాజశ్రీ. కొన్నేళ్లకు ప్రమోషన్ పై హైదరాబాద్ వెళ్లారు. ఆమె మురికి వాడలలోని ప్రజలకు వైద్య సేవలందించారు. గత ఏడాది డాక్టర్ రాజశ్రీ ప్రమోషన్ పై  చార్మినార్ డిఎంహెచ్ బాధ్యతలు చేపట్టారు. ఆమె ఇటీవలనే సొంత జిల్లా నిజామాబాద్ డిఎంహెచ్ వోగా బదిలీపై వచ్చారు. చాలా కాలం నిజామాబాద్ జిల్లాలో వైద్య సేవలందించిన ఆమె గ్రామీణులకు వైద్యం అందించడం లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు.

డాక్టర్ మధుశేఖర్ (జనరల్ సర్జన్)

డాక్టర్ మధుశేఖర్.. తండ్రి లింగయ్య కోరిక మేరకు వైద్య వృత్తి చేపట్టిన మధుశేఖర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో జనరల్ సర్జన్ పూర్తి చేశారు. 1992లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో ఎం.జె. హాస్పిటల్ నెలకొల్పారు. చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా గ్రామీణులకు ఉచిత వైద్య సేవలందిస్తున్నారు. వైద్యంతో పాటు ప్రజలకు మరింత సేవ చేయాలంటే పాలిటిక్స్  బెటర్ అని భావించారు. ప్రజారాజ్యం తరపున ఆర్మూర్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధికంగా ఓట్లు సాధించారు. ఆ తరువాత బీఆర్ ఎస్ లో చేరారు. కేసీఆర్ ప్రభుత్వంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా కొంత కాలం పని చేశారు.

డాక్టర్ నందిత రమాదేవి (గైనకాలజిస్ట్)

డాక్టర్ నందిత రమాదేవి.. హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజ్ లో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. ఆ తరువాత ఎండీ గైనకాలజిస్ట్ పట్టా పొందారు. డాక్టర్ మధుశేఖర్ ను వివాహం చేసుకున్న ఆమె ఆర్మూర్ ప్రాంతంలో సొంత ఎంజె హాస్పిటల్ లో పెషేంట్లకు వైద్యం అందిస్తారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలందించాలని భావించి తన భర్త డాక్టర్ మధుశేఖర్ ఏర్పాటు చేసిన చేయూత స్వచ్ఛంద సంస్థలో యాక్టివ్ గా ఉంటారు.

డాక్టర్ జైదీప్, (జనరల్ సర్జన్)

డాక్టర్ జైదీప్ .. కన్నతండ్రి డాక్టర్ మధుశేఖర్ ను స్పూర్తిగా తీసుకుని వైద్య వృత్తిలోకి అడుగు పెట్టారు. ఆల్ ఇండియా లెవల్ లో మెడికల్ సీటు సాధించి JIPMER పాండిచెరిలో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. ఆ తరువాత ఆల్ ఇండియా లెవల్ లో పీజీ మెడికల్ సీటు సాధించి PGI చండిగడ్ లో మెడికల్ జనరల్ సర్జన్ పూర్తి చేశారు. వైద్య రంగంలో సూపర్ స్పెషాల్టీ (ఎంసీహెచ్) చేయడానికి ఆయన ఎంట్రెన్స్ కు ప్రిపేర్ అవుతున్నారు.

కీ.శే. బద్దం లింగయ్య ఫ్యామిలీ సభ్యులు

ఒకరు డాక్టర్ అయితే ఆ కుటుంబంలో ఎంతో సంతోషం.. మరి..  పోస్ట్ మాస్టర్ లింగయ్య కుటుంబంలో నలుగురు డాక్టర్ లు ఉండటం విశేషమే కదా.. అంతేకాదు లింగయ్య పెద్ద కూతురు జయశ్రీ భర్త దామోదర్ కూడా డాక్టరే.. అయినా.. ఒకే కుటుంబంలో ఐదుగురు డాక్టర్ లు ఉండటం అరుదు కదూ..

యాటకర్ల మల్లేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking
Advertisements