ఆ తల్లి మొఖంలో బాధ
ఎవరికి అర్థమైతుందో..?
నిర్దేశం, విజయవాడ :
ఇడుపులపాయనుండి ఎన్నికల ప్రచారం ను ప్రారంభించిన YCP అధినేత,సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇగో.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైఎస్ విజయమ్మ మొఖంలో సంతోషం లేదు. కన్న కొడుకు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఐదేళ్లు కొనసాగారని ఆనందం ఆమెలో కనిపించడం లేదు.. కారణం..? రక్తం పంచుక పుట్టిన కొడుకు జగన్.. కూతురు షర్మిలా ఇద్దరు రాజకీయ ప్రత్యార్థులు కావడమే. కష్టాలలో.. సుఖాలలో కలిసి గత అసెంబ్లీ ఎన్నికలలో మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు సాదించి ప్రభుత్వాన్ని ఏర్పటు చేసని జగన్ కు అందరూ దూరమయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ ముగ్గురు రాజకీయ పార్టీలు ఏకమై ప్రభుత్వం ఏర్పటు చేస్తే జగన్ భవిష్యత్ ఏమిటనే బాధ కావచ్చు.. వైఎస్ విజయమ్మ మొఖంలో ఆ బాధ కనిపిస్తోంది.