ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. అతిషిని సీఎం చేయడంపై కేజ్రీవాల్ బిగ్ ప్లాన్

అతిషిని ఢిల్లీ ముఖ్యమంత్రిని చేయడం అరవింద్ కేజ్రీవాల్ పెద్ద రాజకీయ ఎత్తుగడగా పరిగణిస్తున్నారు. మొదటి కారణం ఆమె స్త్రీ కావడం.

0

నిర్దేశం, న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి రాజకీయ ఎత్తుగడకు పెద్ద ట్రంప్ కార్డ్‌గా పరిగణించబడుతుండగా, అతిషిని సీఎం చేయడం ద్వారా కేజ్రీవాల్ మరో ఎత్తుగడ వేశారు. ఢిల్లీకి అతిషి మూడో మహిళా ముఖ్యమంత్రి. కాగా, ఇంతకు ముందు బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ సీఎంలుగా ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లాల్సిన సమయంలో కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అతిషి ఢిల్లీ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన మంత్రిగా ఎదిగారు.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు

అతిషిని ఢిల్లీ ముఖ్యమంత్రిని చేయడం అరవింద్ కేజ్రీవాల్ పెద్ద రాజకీయ ఎత్తుగడగా పరిగణిస్తున్నారు. మొదటిది ఆమె స్త్రీ కావడం. ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్ ఎపిసోడ్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీపై మహిళా వ్యతిరేకి అనే ప్రచారం జరుగుతోంది. పైగా మరో 5 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అతిషీని సీఎం చేయడంతో ఈ మరకలపై సర్ఫ్ ఎక్సెల్ చల్లారు. ఇక ఢిల్లీలో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అందుతోంది. మెట్రోలో కూడా ఉచిత ఛార్జీలు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది. మహిళల్ని తమవైపు తిప్పుకునేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం మంచి ఎత్తుగడలే వేసింది.

పంజాబ్ ఫ్యాక్టర్

అతిషిని ముఖ్యమంత్రిని చేయడం వెనుక మరో పెద్ద అంశం ఏంటంటే.. ఆమె పంజాబీ కావడం. ఢిల్లీ ఎన్నికల్లో సెటిలర్ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఇందులో పూర్వాంచలి, పంజాబీ ఓటర్లు ఎక్కువ. ఢిల్లీ మొత్తం ఓట్లలో 20 శాతానికి పైగానే పంజాబీలు ఉంటారు. మొత్తం 70 స్థానాల్లో దాదాపు 25-28 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై ప్రభావం చూపుతారు. స్వాతంత్ర్యం తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డవారిలో ఎక్కువ మంది పంజాబీలే. 1991లో ఢిల్లీలో అసెంబ్లీ మళ్లీ ఏర్పాటు అయిన మొదటి ఎన్నికల్లో బీజేపీ గెలిచి.. పంజాబీ కమ్యూనిటీ నేత మదన్ లాల్ ఖురానా సీఎం అయ్యారు. బనియా, అగ్రవర్ణాలతో పంజాబీ రాజకీయ సూత్రంతో బీజేపీకి విజయాన్ని ఇచ్చింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking