బ్యాంకు అధికారుల మోసం

బ్యాంకు అధికారుల మోసం

ఇద్దరు ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్లు కుమ్మక్కయ్యారు. వినియోగదారుల పేరుతోనే రుణాలు మంజూరు చేశారు. వారికి తెలియకుండానే మంజూరైన కోట్ల రూపాయలను దర్జాగా ఖాళీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. అవాక్కైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.రామంతపూర్ లోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో భగీరథ గంగ మల్లయ్య మేనేజర్‌గా గతేడాది జులై 27 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పని చేశారు ఇదే సమయంలో షేక్ సైదులు ఎస్‌బీఐకి సంబంధించిన సీసీజీ బ్రాంచ్ లో మేనేజర్ గా పనిచేసేవాడు. వీరిద్దరూ కలిసి 19 మంది వినియోగదారుల రుణాలను నొక్కాశారు. ఎవరైతే వ్యక్తిగత రుణాలు కావాలని బ్రాంచ్‌కు వస్తారో వారి వద్ద నుండి రుణాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ను తీసుకుంటారు.

అనంతరం వారు అర్హులు కాదని అక్కడి నుండి పంపించేస్తారు. అనంతరం వారి పేర్ల మీద రుణాలు పొంది, ఖాతాదారులకు తెలియకుండానే 2.8 కోట్ల రూపాయలను కాజేశారు ఇద్దరు మేనేజర్లు. దీంతో అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టడంతో అసల బాగోతం వెలుగులోకి వచ్చింది.వీటిలో ప్రధానంగా ఫారం 16 ఫోర్జరీ చేసి తప్పుడు అకౌంట్ స్టేట్మెంట్లను సృష్టించి దందా చేసినట్లు విచారణలో వెల్లడైంది. వారు ఇలా వినియోగదారులు పేరా మంచూరైన రుణం డబ్బులను మేనేజర్ గా ఉన్న సైదులు అతడు భార్య షేక్ సుష్మ కుమారుడు వీరయ్యలకు సంబంధించిన అకౌంట్లకు బదిలీ చేసేవాడు. ఈ విధంగా 19 మంది వినియోగదారుల రుణాలకు సంబంధించిన డబ్బులను అంటే సుమారుగా రెండు కోట్ల 84 లక్షల రూపాయలను వారి కుటుంబ సభ్యుల ఎకౌంట్లకు మళ్ళించాడు. ఇదంతా గంగ మల్లయ్య సహకారంతో షేక్ సైదులు చేసినట్లు ఉన్నతాధికారులు విచారణలో వెల్లడైంది.

గంగ మల్లయ్య బదిలీ అనంతరం మరొక మేనేజర్ వీర వసంతరాయుడు వచ్చారు. గతంలో రుణాలకు దరఖాస్తు చేసుకున్నవారు బ్రాంచికు వచ్చి మేనేజర్‌ను కలిసి లోన్ గురించి ఆరా తీసేవారు. ఆ డాక్యుమెంట్లను పరిశీలించి చూస్తే అప్పటికే రుణం తీసుకుని తిరిగి చెల్లించని స్థితిలో బ్యాంకు జాబితాలో కనిపించింది. దీంతో వినియోగదారులు షాక్ గురయ్యారు. దీనిపై ముందుగా బ్యాంకు మేనేజర్ వసంతరాయుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో రెండు కోట్లకు పైగా నగదు దారిమళ్ళిన విషయాన్ని గుర్తించారు. దీంతో నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ కేసులో ఉన్న మేనేజర్లు గంగ మల్లయ్య షేక్ సైదులు అతని భార్య సుష్మ కొడుకు పీరయ్యలు పరారీలో ఉన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!