ఎన్నికల ప్రచారంలో అందరూ అందరే..
– ఓట్ల కోసం నోరు విప్పితే అబద్దాలే..
– మోడీ, రాహుల్, కేసీఆర్ అబద్దాలతో పోటీ..
– మత రిజర్వేషన్ పేరుతో రాజకీయ లబ్ధి..
(ఈదుల్ల మల్లయ్య) పొలిటికల్ లీడరులా మజాకా..? నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ ఎస్ జాతీయ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఏ నేతలైనా అబద్దాలను నమ్ముకుని ఓట్ల కోసం ప్రజల చెవిలో పువ్వు పెడుతున్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ వేగం పెంచింది. ఈనెల 11వ తేదిన ఎన్నికల ప్రచారం ముగియనున్నందున తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే ప్రధాని మోడీ వేములవాడ, హన్మకొండ సభల్లో ప్రచారం చేశారు. ముఖ్యంగా హిందువులు – ముస్లీం మధ్య విబేదాలు సృష్టంచి ఎలాగైనా గెలువాలని భావిస్తోంది. ప్రధాని హోదాలో ఉండి అబద్దాలు చెప్పడంతో విద్యావంతులు నవ్వుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ తక్కువేమి కాదు..
అలాగే బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ లను ఎత్తి వేయడానికి కుట్రపన్నిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించడం కూడా వివాదస్పదమవుతుంది. మళ్లీ కేంద్రంలో బీజేపీ కుట్ర చేసిందని ప్రచారంలో పేర్కొనడంపై విద్యావంతులు మండి పడుతున్నారు. అబద్దాలను నిజాలుగా నమ్మించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేయడం సరియైంది కాదంటున్నారు.
బీఆర్ఎస్ నోరు విప్పితే అబద్దాలే..
కేసీఆర్ బస్సు యాత్రతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భయంతో వణుకుతున్నాయని బీఆర్ ఎస్ నేతలు పేర్కొనడం విడ్డూరంగా ఉంది. లోక్ సభ ఎన్నికలలో ప్రచారం చేస్తున్న సందర్భంగా నోరు విప్పితే అబద్దాలే మాట్లాడుతున్నారు. కేసీఆర్ మరో అడుగు ముందుకు వేసి తాను కాలు ఇరిగి బస్సు యాత్ర చేయడంతో భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆ నిధుల మంజూరును నిలిపి వేసింది.
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో అడుగు ముందుకు వేసి 12 ఎంపీలను గెలిపిస్తే ఆరు నెలల్లో రాష్ట్రంలో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని ప్రజలను నమ్మిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ ఎస్ కు ఒక్క సీటు కూడా గెలువదని సర్వేలు చెబుతున్నాయి. అయినా.. అబద్దాలతో ప్రచారం చేసి పరువు తీసుకుంటున్నారు. హరీష్ రావు కూడా తాను ఏమి తక్కువ కాదని భావిస్తున్నారు. మాటల గారడితో ప్రజలను నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.