రామోజీరావు పాడే మోసిన చంద్రబాబు నాయుడు
మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భౌతికకాయానికి అంజలి ఘటించిన ఆయన స్మృతివనం వరకు సాగిన అంతిమయాత్రలో భాగంగా రామోజీరావు పాడెను మోశారు. కడసారి కన్నీటి వీడ్కోలు పలికి రామోజీ కుటుంబ సభ్యులను ఓదార్చారు.