బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్..సినీ నటుల పై కేసులు
500 కోట్లు లూటీ చేస్తున్న సెలబ్రిటీస్!
హైదరాబాద్, నిర్దేశం:
పోలీస్ డిపార్ట్మెంట్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలెబ్రిటీలపై చాలా తీవ్రమైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే హర్ష సా, బన్నీ సన్నీ యాదవ్ వంటి వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. త్వరలోనే యాంకర్ శ్యామల, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విష్ణు ప్రియ టేస్టీ తేజ వంటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసారు. వీరితో పాటు రీతూ చౌదరి, కిరణ్ గౌడ్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, ఇలా మొత్తం మీద 11 మంది టాప్ సెలబ్రిటీస్ పై కేసులు నమోదు చేసారు. వీరిపై త్వరలోనే కఠినమైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. చిన్న పిల్లల జీవితాలతో ఆడుకునే ఇలాంటి మహమ్మారి యాప్స్ ని ప్రమోట్ చేయడం చాలా తప్పు కదా, సెలెబ్రిటీస్ తప్పు అని తెలిసి కూడా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటే, అందుకు కారణం డబ్బు.ఒక సినిమా లేదా ఒక సీరియల్ చేస్తే వీళ్లకు ఎన్ని కోట్లు వస్తాయో తెలియదు కానీ, బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తే 500 కోట్ల రూపాయిల వరకు సంపాదించుకోవచ్చు అట. హర్ష సాయి అలా 500 కోట్ల రూపాయిల డీల్ ని రీసెంట్ గానే కుదురించుకున్నాడట. ఇతనికి యూట్యూబ్ లో కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకుండా ఎందుకు ఉంటాడు చెప్పండి?, ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి వెళ్లడంతో వెంటనే యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టారు. కేసు ఇలా నమోదు అయ్యింది, అలా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ రీతూ చౌదరి ‘#సే నో టూ బెట్టింగ్ యాప్స్’ అంటూ ఒక వీడియో ని చేసి అప్లోడ్ చేసింది. ముందు నుండే ఇలాంటి క్యాంపైన్స్ ఎందుకు రన్ చేయలేదు?, దెబ్బ పడితే కానీ నొప్పి తెలియలేదు అన్నమాట. ఇప్పుడు దీనిపై ఫుల్ నెగటివ్ క్యాంపైన్ నడుస్తుంది కాబట్టి, ఎవ్వరూ చేయడం లేదు, భవిష్యత్తులో వేడి తగ్గిన తర్వాత మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయరని గ్యారంటీ ఏమిటి. డబ్బు మనిషి చేత ఎలాంటి పనిని అయినా చేయిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం