నిర్మల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
నిర్దేశం, నిర్మల్ :
నిర్మల్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు బిగ్ షాక్లు తలుగుతూనే ఉన్నాయి. నిన్నటి రోజు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తో పాటు పలువురు కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయగా సోమవారం నిర్మల్ రూరల్ మండలంలో పలు గ్రామాలకు చెందిన 15 మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, గ్రామ అధ్యక్షులతో కలిపి సుమారు 70 మంది మూకుమ్మడిగా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరి రాజీనామ పత్రాన్ని నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డికి అందజేశారు.
వీరు త్వరలో డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు పేర్కొన్నారు.