మావోయిస్టుల బంద్..
పోలీసుల హై అలర్ట్. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు….
నిర్దేశం, మహాదేవపూర్ : తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్ట్ బంద్ పిలుపు నేపద్యంలో పోలీసులు హైఅలెర్ట్ అయ్యారు. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దులోని కర్రిగుట్ట అటవీప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయుస్టుల మృతికి నిరసనగా సోమవారం మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపద్యంలో ఆయా రాష్టాల సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తమైన పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు,సరిహద్దు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో గోదావరి, ప్రాణహిత ,ఇంద్రావతి నది పరివాహక ప్రాంతాల్లో పోలీసులు భారీగా కూంబీంగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులను విచారించి వదిలేస్తున్నారు. మరోవైపు తెలంగాణాసరిహద్దున కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఇరు రాష్ట్రాల నుండి రాకపోకలు కొనసాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనుమానితులను విచారించి వదిలేస్తున్నారు.