మందు బాబులకు ఇంత కంటే గుడ్ న్యూస్ ఉండదు.. ఇప్పుడు ఏ బ్రాండ్ అయినా రూ.99కే

దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలపై అధ్యయనం చేసి రిపోర్ట్ అందించారు. కొన్ని మార్పులు చేసి రాష్ట్రంలో ప్రవేశపెడతారు

0

నిర్దేశం, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సరసమైన ధరకే నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలానే ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సగటు మద్యం ధర క్వాటర్ కి రూ.99 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే నూతన లిక్కర్ పాలసీ ఎలా ఉండాలనే దానిపై అధికారులు తీవ్ర కసరత్తులు చేసి ఓ నమూనా రూపొందించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలపై అధ్యయనం చేసి రిపోర్ట్ అందించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న విధానంలో కొన్ని కొన్ని మార్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మద్యం షాపుల కోసం టెండర్లను ఆహ్వానించాలని ఇప్పటికే నిర్ణయించారు. తొందరలోనే నూతన మద్యం విధానం ఖరారు చేసి.. మద్యం షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ, లైసెన్సుల కేటాయింపు వంటి ప్రక్రియ అంతా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. సెప్టెంబరు నెలాఖరులోగా ఇవన్నీ పూర్తి చేసి అక్టోబరు 1వ తేదీ నాటికి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు మద్యం నియంత్రణకు సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని చంద్రబాబు సర్కార్ ప్లాన్ చేస్తోందట.

Leave A Reply

Your email address will not be published.

Breaking
Advertisements