సంక్రాంతి సంబరాలు
అత్తారింటికి భువనగిరి అల్లుడు..
మకర సంక్రాంతి.. దేశంలోనే అత్యంత పవిత్రమైన హిందూ పండుకలలో ఇదో పండుగ. ఆ ఇంటిలో పెళ్లైతే.. బంధువులు, శ్రేయోభిలాషుల మధ్య కొత్త అల్లుడు – కూతురులను ఇంటికి ఆహ్వనించి నోము కోవడం, ప్రత్యేక పూజలు చేయడం ఇదో తంతు. ఆంధ్రలో ఎక్కువగా కనిపించే ఈ మకర సంక్రాంతి పండుగ ఆనవాయితీ మన తెలంగాణలోనూ జరుగుతుంది.
అల్లుడు -కూతురు సంతోషం కోసం..
హైదరాబాద్ నగరం కొంపల్లిలోని అశోక్ విల్లాస్ లో దేవేందర్ గుప్తా ఇంట్లో జరిగిన మకర సంక్రాంతి వేడుకలను చూసి అల్లుడు వీక్షిత్ తల్లిదండ్రులు ఉప్పుల సబితా – రమేష్ లతో పాటు కూతురు శరణ్య లకు సాదరంగా ఆహ్వనించారు ముత్యం అర్చన, దేవేందర్ గుప్తా. మకర సంక్రాంతి వేడుకల సందర్భంగా నాలుగు వందల రకాల వైరైటీ పుడ్స్ తో బోజనాలు ఏర్పాటు చేశారు.
పండ్లు, పిండి వంటలు, కూరగాయాలు, పూల బుట్టలు, దేవుడి విగ్రహాలు ఇలా ఎన్నో వెరైటీలతో ఏర్పాటు చేసి కొత్త అల్లుడు – కూతురులను ఇంటికి ఆహ్వానించారు ముత్యం వారి కుటుంభీకులు.
పల్లెటూరి అలంకరణతో స్వాగతం
ముత్యం దేవేందర్ ఇంటికి వెళ్లగానే గాలిపటంలతో ప్రత్యేకంగా తయారు చేసిన మొఖద్వారం… ఆ పక్కనే గోడలపై పల్లెటూరి ఇండ్లు, పశువులు, రైతుల చిత్రాలు.. నిలువెత్తు చెరుకు గడిలు.. వాటి మధ్యన పూలు.. ముగ్గులు, బోనాలు.. ఇంటి ముందు మంచంపై వెరైటీ వస్తువులు వెల్ కమ్ చెప్పాయి.
‘సంక్రాంతికి అత్తారింటికి భువనగిరి అల్లుడు ముత్యం వారి రుచులు’ అంటూ ఏర్పాటు చేసిన బోర్డు ప్రత్యేక ఆకర్శణగా నిలిసింది.
మరిచి పోలేని జ్ఞాపకాలు..
నూతన దంపతులు
లు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ మధురమైన జ్ఞాపకాలను కెమోరాలో బందించడానికి ఫోటో గ్రాఫర్ లు.. వీడియో గ్రాఫర్ లు హడావుడి కనిపించింది. పంచ గౌరమి, అన్నపూర్ణ, తొట్లెలో లాలీ గౌరమ్మ ల శిల్పలు.
అమ్మవారి, అయ్య వారి మొకుటం దేవతల విగ్రహాలు అందరిని ఆకర్శించాయి. ప్రత్యేకంగా అలంకరించిన ఆ వస్తువులను మహిళలు చూస్తూ అక్కడే ఫోటోలు దిగారు.
నోము వ్రతంతో కోరికలు..
మకర సంక్రాంతి పండుగ నాడు నోము వ్రతం చేయడం వల్ల కోరుకునే కోరికలు తప్పకుండా నెరవేరుతాయనేది కుటుంభీకుల విశ్వాసం. ఇంటి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచంపై కూతురు శరణ్యను కూర్చోబెట్టి ముత్తాయిదలు ప్రత్యేకంగా పూజలు చేశారు. ‘అల్లో నేరాడి అల్లో..’ అంటూ పాటలు పాడారు.
బోజనంలో 400 వంటకాలు..
మూడు గంటల పాటు జరిగిన మకర సంక్రాంతి నోము పూజలు చివర ఘట్టం లో అల్లుడు వీక్షిత్ – కూతురు శరణ్యలకు వైరైటీగా బోజనం ఏర్పాటు చేయడం. ఆ నూతన దంపతుల కళ్లకు గంతలు కట్టి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వంటకాల వద్దకు తీసుకెళుతారు. నాలుగు వందలకు పైగా వైరైటీలతో ఏర్పాటు చేసిన వంటకాలను చూసి మురిసి పోతారు ఆ దంపతులు.
జీవితంలో మరిచి పోము.. : దంపతులు
మకర సంక్రాంతికి పుట్టింటికి వచ్చిన తమకు అమ్మ నాన్నలు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారన్నారు శరణ్య.. నోముల పూజల కోసం ఇంతా వైరైటీగా చేస్తారని అనుకోలేదన్నారు ఆమె. అత్లారింటిలో ఇంత ఘనంగా తనకు స్వాగతం లభించిడం జీవితంలో మరిచి పోలేనంటున్నారు అల్లుడు వీక్షిత్. ప్రత్యేకంగా చూసిన ఆ అనుభూతిని మాటలలో చెప్పలేనంటున్నారు అతను.
అల్లుడు, కూతురు మొఖంలో సంతోషం కోసం..
పెళ్లైనా అల్లుడు వీక్షిత్, కూతురు శరణ్యలు ఇంటికి వస్తున్నందున వారి మొఖంలో సంతోషం చూడటానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసామంటున్నారు దేవేందర్ గుప్తా.. పిల్లల సంతోషం కంటే ఏది ముఖ్యం కాదంటున్నారు ఆయన.
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్