రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మాడల్ లోని జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో *ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి *
బుధవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గౌరవ జడ్పీచైర్ పర్సన్ న్యాలకొండఅరుణరాఘవరెడ్డి గారిఅధ్యక్షతన జడ్పీసర్వసభ్యసమావేశం జరిగింది. ఈసమావేశానికి గౌవవ మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ హజరయ్యారు. మా ఇల్లంతకుంట మండలంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని గౌరవ ఎంపిపి వుట్కూరి వెంకటరమణా రెడ్డి కోరారు. సమావేశంలో ఆయన మాట్లాడుతు మూడు సమస్యల పై తన గొంతును సమావేశంలో గౌరవ చైర్ పర్సన్, అధికారులు, సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు.పంచాయతీ రాజ్ రోడ్లు చాల అద్వాన్నంగా ఉన్నాయని, వాటిని వెంటనే మరమ్మత్తులు చేయించాలన్నారు. రోడ్లు గుంతలు ఉండడంతో ప్రయాణికులు తీవ్రఇబ్బందులు పడుతున్నారని వెంటనే రోడ్లు బాగుచేయించాలని సూచించారు.గ్రామాలలో ఇష్టానుసారంగా టి ఫైబర్ కేబుల్ పేరిట తవ్వకాలు చేస్తున్నారన్నారు. దీంతో రోడ్డు ఇరువైపుల పెట్టి కొట్ల రూపాయల హరితహారం చెట్లు తీసేస్తున్నారని సూచించారు. ఫైబర్ కేబుల్ ద్వారా రోడ్డు పై మట్టి పోయడంతో ప్రయాణికులు , రైతులు ఇబ్బంది పడుతున్నారని, అంతే కాకుండా మొక్కలు తోలగిచండం తో విమర్శలు వస్తున్నాయన్నారు. గ్రామాలలో గతంలో మినిఫంక్షన్ హాల్ ల పనులను మొదలు పెట్టివ్వాలని, వాటి కోసం నూతన టెండర్లను వేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టి గౌరవ సిఎం కేసిఆర్ గౌరవ మంత్రి కేటిఆర్ గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశాలను గౌరవించాలన్నారు. మీ ఎంపిపి వుట్కురి వెంకటరమణా రెడ్డి, ఇల్లంతకుంట బొల్లం సాయిరెడ్డి మాడల్ రిపోర్టర్.