తీన్మార్ మల్లన్న తిరుగుబాటు..
- రేవంత్ పై విమర్శలు..
- బీసీ కార్డుతో మంత్రి పదవిపై కన్ను..
- నాడు కేసుల భయంతో బీజేపీ వైపు..
- ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్ లోకి…
- రాజీనామా చేస్తానని బెదిరింపు..
తీన్మార్ మల్లన్న.. ఈ పేరు రాజకీయాలపై అవగహన ఉన్న వాళ్లకు బాగా పరిచయం. మార్నింగ్ న్యూస్ పై విశ్లేషిస్తూ కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసే మల్లన్న పలు అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. చివరగా రాజకీయంగా తాను ఆశించిన పదవిని సాధించారు. కానీ.. ఇప్పుడు ఆయన ముందన్న లక్ష్యం మంత్రి పదవి. అందు కోసం పావులు కదుపుతున్నారు మల్లన్న.
ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న..
తీన్మార్ మల్లన్నది నోరు పెద్దగా ఉంటుంది. ఒకే విషయాన్ని రెండు వైపుల తెలివితో వివరణ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. యూ ట్యూబ్ న్యూస్ ఛానెల్ నడుపుతూ జర్నలిస్ట్ పేరుతో తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీలలో చేరడం చర్చనీయంషంగా మారింది.
తీన్మార్ మల్లన్న రాజకీయంగా..
తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్.. వీ6 లో తీన్మార్ ప్రొగ్రాం చేయడం వల్ల తీన్మార్ మల్లన్నగా పేరు మార్చుకున్నారు. రాజకీయంగా ఎదుగాలనే ఏకైక లక్ష్యంగా అడుగులు వేసిన ఆయన మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఓడి పోయారు. ఈ తరువాత ప్రొఫెసర్ కొదండరాం పెట్టిన తెలంగాణ జన సమితి పార్టీలో చేరారు. కొన్నిరోజుల్లోనే ఆ పార్టీని వదిలారు.
కేసుల భయంతో బీజేపీ వైపు..
కేసీఆర్ ప్రభుత్వం పెడుతున్న కేసులకు భయపడి తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. కొంత కాలంలోనే ఆ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. కానీ. ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు.
ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని..
బీసీ కోట కింద మంత్రి పదవి కోసం తీన్మార్ మల్లన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన ఆరోపణలు చేయడం ఇందుకు నిదర్శనం. కానీ.. సీఎం రేవంత్ కూడా తీన్మార్ మల్లన్నను పట్టించుకోక పోవడంతో విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు తీన్మార్ మల్లన్న ఏమి చేయబోతున్నారో ఎదురు చూడాల్సిందే.