బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
హైదరాబాద్
ఎంపి బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలెపారు. నిన్న ఎన్నికల ప్రచార సందర్భంగా నేను బండి సంజయ్ ని ప్రశ్నించాను. 5 సంవత్సరాల పదవి కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎం చేసారని ప్రశ్నించానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీరాముని పేరు మీద ఓట్ల అడగడం కాదు మీరు నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు బండి మాట్లాడుతున్నారు.. ఇది ఎంత వరకు సమంజసం సభ్య సమాజాన్ని కొరుతున్నానని అన్నారు. జన్మనిచ్చిన తల్లి నా తల్లి అయిన..ఇంకా ఎవరి తల్లి అయినా నాకు తల్లే. రాజకీయంగా అడిగిన ప్రశ్న అభివృద్ధికి సంబంధించినది అయితే ..అతడు మాట్లాడిన మాట నా తల్లి జన్మకు సంబందించిన మాట. సమాజం గమనించాలి. రాజకీయంగా డ్రామాలు చేస్తూ యాత్ర ని కొనసాగిస్తున్నాడు. అతని యాత్ర కి ప్రచారం రావాలని అడ్డుకున్నట్టు కొత్త డ్రామాలకు తెరలెపారు . మేము మీ యాత్రలు అడ్డుకోవడం లేదు. ప్రజా స్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉందని అన్నారు. మీరు మాట్లాడిన మాటలపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని అంటున్నాను. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతున్న అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. భార్య కి మంగళ సూత్రం కడతారు..అటువంటి మంగళ సూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి బండి సంజయని అన్నారు.
ఆనాడు ఆయోధ్య రాముడిగా సీతమ్మ కోసం పడ్డ కష్టం తండ్రి మాటకు కట్టుబడి విలువిచ్చి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు. నా తల్లి జన్మ గురించి మాట్లాడితే ఎం రాజకీయం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం ఆలోచించాలి. వాళ్ళని అడుగుతున్న ఇటువంటి నాయకుల డ్రామాలకు సమర్థిస్తున్నారా..? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుని అడుగుతున్న ఈ జిల్లాకి సంబంధించిన బీజేపీ నాయకులను అడుగుతున్న. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఐదేళ్లలో మీరేం చేశారు నేను ఎంపీగా ఉన్నప్పుడు నేనేం చేశాను ప్రజలు గమనించాలి. మీరు నియోజకవర్గాల్లో ఏం చేయలేదని ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ఓడిపోతాననే భయంతో ఇటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఈ మాట ఆనాడు కెసిఆర్ హిందుగాల్లు బొందుగాళ్ళు అంటే రాజకీయంగా ఎన్నికల్లో ఏవిధంగా వాడుకున్నావొ. తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్.. జాగ్రత్త. మేము హింసావాదులం కాదు. శవం మీద పేలాలు ఏరుకునే రకం కాదు యాత్ర చేసుకో ఏమైనా చేసుకో. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం.. మేము యాత్రకి అడ్డుపడతలేం. నాలుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బండి సంజయ్ అని అన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!