సక్సెస్ స్టోరీ
ఆలస్యమైన రొట్టెలతో అద్బుతమైన ఆలోచన.. బీపీ, షుగల్ పేషెంట్ల కోసం పుడ్ తయారీ..
ఉరుకుల పరుగుల జీవితంతో షుగర్, బీపీ లేకుండా ఉండేవాళ్లు తక్కువే.. ఆ బీమారులు ఉన్నోళ్లు రొట్టె తినడం ఆరోగ్యానికి మహాభాగ్యం అంటారు వైద్యులు.. ఇగో.. కవిత కూడా రొట్టెల కోసం వెళ్లింది.. గంటల తరబడి ఆలస్యమైంది.. అందుకు గల కారణం ఆమెకు అర్థమైంది.. ఆ అద్బుతమైన ఆలోచన నుంచి పుట్టిందే మాతృశ్రీ రొట్టెల సెంటర్..
తూప్రాన్ కు చెందిన కవిత జీవితంలో మరిచి పోలేని విషాదకరమైన సంఘటన తన సొంత తమ్ముడు పోతగౌని అంజన్ గౌడ్ గుండెపోటుతో మరణించడం.. దశదిన కర్మకు హాజరైన వారిలో కొందరు షుగర్, బీపీలతో బాధపడుతున్న వారున్నారు.
అగో.. అలాంటి వారి కోసం రొట్టెలు కావాలని హోటల్ వద్దకు వెళ్లితే గంటల తరబడి నిరిక్షించింది కవిత.. విసిగి పోయింది. గతంలో తాను మెదక్ లో సోదరి సంద్యతో వెళ్లి చూసిన రొట్టెల తయారీ మిషన్ గుర్తుకు వచ్చింది.
బ్రతుకు తెరువు కోసం తాను ఇతరుల వద్ద పని చేసే బదులుగా రొట్టెల మిషన్ ద్వారా స్వయం ఉపాధి పొందాలని ఆలోచన చేసింది కవిత. సింగపూర్ లో ఉన్న తన సోదరుడు నర్సింహాగౌడ్ ప్రొత్సహించారు.
అయినా.. ఆ రొట్టెల మిషన్ కోసం రెండున్నర లక్షల రూపాయలు ఎలా అనే ఆలోచనకు తన మెడలో ఉన్న బంగారం కుదువ పెట్టింది. బంధువుల వద్ద కొంత అప్పు చేసింది. మూడు నెలల క్రితం తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి క్రిష్ణా ముదిరాజ్ తో మాతృశ్రీ రోటి సెంటర్ ను ప్రారంభోత్సవం చేయించింది కవిత.
ఒకప్పుడు కవిత ఉపాధి కోసం..
ఒకప్పుడు కవిత ఉపాధి కోసం చాలా బాధ పడ్డది. ప్రవేట్ కంపెనీలలో కొంత కాలం పని చేసింది. రోజంతా పని చేసినా నెలకు ఆరు వేలు మాత్రం వేతనంగా ఇచ్చారు. కానీ.. ఇప్పుడు కవిత ‘మాతృశ్రీ రొట్టెల సెంటర్’ ద్వారా మరో మహిళ మంజులకు ఉపాధి చూపుతుంది.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తన భర్త ఈశ్వర్ గౌడ్ ప్రైవేట్ జాబ్ చేస్తునే తనకు సహాయం చేస్తారని చెబుతుంది. ఒకరి వద్ద పని చేసే బదులు స్వయం ఉపాధితో పని చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఆమె. నిజంగా కవితకు వచ్చిన అద్భుతమైన ఆలోచనను ఆచరణలో పెట్టినందుకు మనం హ్యాట్సాప్ చెబుదాం..
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్