ఏసీబీ అధికారులకు సెల్యూట్.. జైలుకు ముగ్గురు అవినీతి అధికారులు..
నిర్దేశం, హైదరాబాద్ :
డబ్బులు.. డబ్బులు.. ఈ డబ్బుల కోసం అధికారులు అవినీతికి శ్రీకారం చుట్టారు. ఆ అవినీతి అధికారుల భరతం పట్టడానికి ఏసీబీ దాడులు చేస్తున్నారు. ఇగో.. అసిఫాబాద్ ఎస్సై రాజ్యలక్ష్మి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కింది. అలాగే నల్గొండ జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సోమేశ్వర 18 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండ్ గా ఏసీబికి చిక్కారు. ఆర్టీసీ హుజురాబాద్ డిపో మేనేజర్ సామల శ్రీకాంత్ సైతం 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. అయితే.. ఈ ముగ్గురు అవినీతి అధికారులు ఇప్పుడు జైలు గోడల వెనుక ఉన్నారు.
అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబి అధికారులను మనం హ్యాట్సాప్ చెబుదాం..