మీ సేవకు రికార్డు స్థాయి అప్లికేషన్లు

మీ సేవకు రికార్డు స్థాయి అప్లికేషన్లు

– రాజీవ్ యువ వికాసానికి 14 ల‌క్ష‌ల అప్లికేష‌న్లు
– ఒక్క‌సారిగా స‌ర్వ‌ర్ డౌన్ అయిన మీసేవ

నిర్దేశం, హైద‌రాబాద్ః

నిరుద్యోగ యువతను ఆదుకునే విధంగా ప్రభుత్వం రీసెంట్ గా ప్రకటించిన రాజీవ్ యువ వికాసానికి భారీ స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. ఈ అప్లికేషన్లను కూడా మీ సేవ కేంద్రాల్లో సబ్మిట్ చేయాల్సి ఉండటంతో ఒక్కసారిగా మీ సేవ కేంద్రాలకు జనాల తాకిడి పెరిగింది. అసలు మీసేవ చరిత్రలోనే రికార్డు స్థాయిలో కేవలం రెండు మూడు వారాల్లో సుమారు 14 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

రాజీవ్ వికాసం కోసం దరఖాస్తు చేయాలన్న దరఖాస్తు చేయడానికి కావలసిన సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలన్న సర్టిఫికెట్స్ లేని వారు మీ సేవ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఈనెల 14తో రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకునే ముగియనుంది. రాజు యువ వికాస్ పథకం ప్రకటించిన తర్వాత మార్చి 24 నుంచి ఇప్పటివరకు 14 లక్షల పైగా అప్లికేషన్స్ వచ్చాయి. రాజీవ్ యువ వికాస్ కింద ఒక్కరికి కనీసం 50,000 నుంచి 4 లక్షల వరకు ప్రభుత్వం రుణాలు ఇస్తుంది. ఈ రుణాలు పొందాలంటే అర్హతగా వైట్ రేషన్ కార్డ్ లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నరలోపు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల వరకు ఆదాయం ఉన్నట్టుగా ఇన్కమ్ సర్టిఫికెట్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది వద్ద ఇన్కమ్ సర్టిఫికెట్ లేకపోవడంతో మీ సేవలో తాకిడి పెరిగింది.

ఈ నెల 14న చివరి తేదీ తర్వాత వచ్చిన అప్లికేషన్లను కేటగిరీలు, కార్పొరేషన్లు, సమైక్యలవారీగా విభజించనున్నారు. సుమారు 6వేల కోట్లను నిరుద్యోగ యువతకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ నెల 16న బ్యాంకర్లతో సమావేశమై రుణాలు తదితరు అంశాలపై కార్యచరణ రూపొందించనున్నట్లుగా తెలుస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాలు పొందాలంటే అవసరమైన క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం మార్చి 24 దరఖాస్తులు ప్రారంభిస్తే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 13.98 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇంత తక్కువ సమయంలో ఎన్ని లక్షల దరఖాస్తుల రావడం మీసేవ చరిత్రలో రికార్డుగా నిలిచింది. గత 15 రోజుల్లో 11.34 లక్షల అప్లికేషన్లను యాక్సెప్ట్ చేశారు ఇంకా 2.64 లక్షల దరఖాస్తులు అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే సర్వర్లు డౌన్లోడ్ సమస్యను దృష్టిలో ఉంచుకొని వరుస సెలవులు కూడా ఉండటంతో గడువు ఈ నెలాఖరి వరకు పొడిగించాలని కోరుతున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »