కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుందో తెలుసా..!!
మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చిన వెంటనే వారికి మంచి నీరు ఇచ్చి స్వాగతం పలికే సంప్రదాయం మనది. లేదా మజ్జిగ ఇచ్చి దాహం తీర్చే సంస్కృతి మనది. కాని మనం ఏం చేస్తున్నాం ? మన ఇంటికొచ్చిన అతిథులకే గాక, మన పిల్లలకు కూడా కూల్డ్రింక్సు పేరు చెప్పి చల్లటి విష పదార్థాన్ని ఇస్తున్నాం.కూల్డ్రింకు సీసాలను పెద్దమొత్తంలో ఇంటికి తెచ్చుకొని ఇంట్లో ఫ్రిజ్లో నిల్వ ఉంచి, మనం ఆనందంగా తాగడమే గాక, అతిథి మర్యాదల పేరుతో ఇతరులను తాగమని బలవంత పెడుతున్నాం.
ఏదన్నా ఒకటి డబ్బు పెట్టి కొని తిన్నామన్నా, తాగామన్నా , దాని ద్వారా మనకు రుచీ, ఆనందంతో పాటు, కొద్దిగా ఆరోగ్యం లభిస్తే పరవాలేదనుకోవచ్చు , కాని మనం డబ్బు దారబోసి కూల్డ్రింకులు, “స్లో పాయిజన్” రూపంలో తాగుతూ, మన ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నాం. కూల్ డ్రింకుల్లో యాసిడ్స్ (ఆమ్లాలు) మరి కొద్దిగా తీయటి నీల్లు తప్ప ఇంకేమీ ఉండవని అందరూ తెలుసు కోవాలి.ఒక పదార్థంలో ఆమ్లగుణం (యాసిడ్ నేచర్) ఉన్నదా? క్షారగుణం (బేస్ నేచర్) ఉన్నదా? ఏది ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మనకు పిహెచ్ మీటరు సహకరిస్తుంది.
పిహెచ్ విలువ 7 కంటే ఎక్కువగా ఉంటే క్షారగుణం (బేస్) అని, 7 కంటే తక్కువ ఉంటే ఆమ్లగుణం (యాసిడ్) అని తెలుస్తుంది. ఏ పదార్థంలోనన్నా ఆ పిహెచ్ మీటరును ముంచితే ఆ పదార్థం ఏ స్థితిలో ఉన్నది. అందులో నుంచి వచ్చే అంకె విలువని బట్టి తెలిసిపోతుంది.కూల్డ్రింక్ను గ్లాసులో పోసి ఆ పిహెచ్ మీటరును అందులో ముంచితే, వాటి బండారం బయటపడుతుంది. ఇప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న పదికి పైగా రకాల కూల్డ్రింకులను పరీక్షిస్తే , వాటి పిహెచ్ విలువ 1.1 నుంచి 2.0 మధ్యలోనే ఉంటుందనేది మనకు తెలిసిపోతుంది.
అన్ని కూల్ డ్రింకులకు ఇదే రేంజ్ లో పిహెచ్ విలువ ఉంటుంది. తియ్యగా ఉండే వాటిలో, పుల్లపుల్లగా ఉండే వాటిలో కూడా అంతంత యాసిడ్ ఉన్నట్లు క్లియర్ గా తెలుసిపోతుంది.మనం లెట్రిన్స్ను శుభ్రం చేసుకునే యాసిడ్ సీసాలను మీరి చూసే ఉంటారు. ఆ యాసిడ్ యొక్క పిహెచ్ విలువను చూస్తే 1.5 నుంచి 2.0 మధ్యలోనే ఉంటుంది. అంటే లెట్రిన్లు కడిగే ఆ యాసిడ్ లు ఉన్నంత ఘాటుగా మనం తాగే కూల్ డ్రింకులు కూడా ఉంటాయన్న మాట.
లెట్ట్రిన్ లో ఎండిపోయిన మలంపై యాసిడ్ ను పోస్తే శుభ్రంగా తినేస్తుందని మనందరకీ తెలుసు కదా. అలాగే మనం తాగే కూల్డ్రింక్ లు కూడా, లెట్రిన్ క్లీన్ చేసే యాసిడ్తో సమానంగా ఆమ్లగుణాన్ని (యాసిడ్ నేచర్ ను) కలిగి ఉన్నాయని తెలుసుకోండి.కావాలంటే మీరు ఓసారి లెట్రిన్ బాగా మరకలు పడిపోయి, ఎండిపోయి ఉన్నపుడు, దానిపై యాసిడ్ పోయకుండా, యాసిడ్కు బదులుగా, కూల్డ్రింకును పోసి అయిదు నిమిషాలు ఆగి, ఆ తర్వాత శుభ్రం చేయండి.
మన కూల్ డ్రింకు చక్కగా, యాసిడ్ లాగా పనిచేసి, ఆ లెట్రిన్ ప్లేట్ను శుభ్రం చేసేస్తుంది.
టాయ్లెట్ క్లీనర్స్ తో సమానమైన కూల్డ్రింక్స్ ను మనం తాగవచ్చా ? మన పిల్లల చేత తాగించవచ్చా ? మన బందు, మిత్రులను కూడా తాగండి,తాగండని బలవంతం చేయొచ్చా ? ఒకసారి ఆలోచించండి !ఎన్నెన్నో హానికారక రసాయనాలు కూల్ డ్రింకుల్లో కలుపుతారు. వీటిలో ముఖ్యంగా ఫాస్పారిక్ యాసిడ్, కార్బొలిక్ యాసిడ్, ఎరిథార్చిక్ యాసిడ్, బెంజాయిక్ యాసిడ్ అనేవి ఉంటాయి. ఇన్ని రకాల యాసిడ్లు కలిస్తే గాని మనకు మజా రావడం లేదు.
అందుచేతే కూల్డ్రింక్ తాగినపుడు గొంతులో, కడుపులో మంట, త్రేన్పులు, కపాలంలో, తలనరాలల్లో విపరీతమైన బాధ, ఎసిడిటీ వస్తుంటాయి. మన శరీరంలో అత్యంత గట్టి పదార్థం మన దంతాలే. ఇంత గట్టిగా ఉండే మన దంతాలను ఓ 20 రోజుల పాటు ఏదైనా ఒక కూల్డ్రింక్లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతాయి. ఆ దంతాలు రంగు మారిపోయి, వేల్లతో నొక్కితే పిండిగా అయిపోతాయి. ఒక కూల్డ్రింకులో ఒక పన్నును వేసి 8 రోజుల తర్వాత చూసినా ఆ పన్ను పూర్తిగా కరిగిపోతుంది.
మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపులో 50 టన్నుల ఆహారాన్నయినా ఈ పళ్లతో నములుతాం. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలినా అరగని పళ్లు మాత్రం ఒక కూల్డ్రింక్ వారము తిరగకుండానే కరిగించేస్తున్నదంటే మనం తాగే డ్రింకులలో యాసిడ్ ఎంత ఉందో తెలిసి పోతుంది కదా.అలాంటి గట్టి పళ్లనే నాశనం చేసే డ్రింక్స్ కి మన లోపలి పేగులు, నరాలు, కణాలు ఒక లెక్కా ఏమిటి.
కూల్ డ్రింకులను నిల్వ ఉంచేందుకు బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) వంటి విషవాయువును కలిపుతారు. ఈ భూమి పై నివసించే ప్రతి ప్రాణితో పాటు మనం కూడా శ్వాస క్రియలో భాగంగా, ప్రాణవాయువును లోపలకు పీల్చుకొని, కార్బన్డైఆక్సైడ్ను బయటకు విడిచిపెడుతూ ఉంటాం.ఈ కార్బన్ డై ఆక్సైడ్ అనే విషవాయువును కూల్డ్రింక్స్ను ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంచటం కోసం కలుపుతున్నారు. అందుచేతనే మనం ఏ రకమైన కూల్డ్రింక్ తాగినా, తాగిన వెంటనే నోటిలో నుంచి, ముక్కులో నుంచి ఆ చెడ్డవాయువు త్రేన్పుల రూపంలో బయటకు వస్తుంది.
ఒక కాలేజీలో ఇద్దరు కుర్రాళ్లు పోటీ పెట్టుకొని ఒకరు 8, మరొకరు 9 కూల్డ్రింక్స్ను అతి కష్టంగా తాగారు. డాక్టరు వచ్చేలోపే ఆ ఇద్దరూ చనిపోయారు. శవపరీక్షలో చూస్తే వారిద్దరి శరీరంలో కార్బన్డైఆక్సైడ్ అనే విష వాయువు ఎక్కువై పోయి మరణించారని తెలిసింది. ఈ సంఘటన మహా రాష్ట్ర లోని ముంబాయి నగరంలో జరిగింది. కూల్డ్రింక్స్లో విషపూరిత రసాయనాలయిన ఆర్సనిక్, కాడ్మియం, జింక్, సోడియం గ్లూటమేట్, పొటాషియం సార్బేట్, మిథాయిల్ బెంజీన్, బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలుపుతున్నట్లు వెల్లడైంది. ఇవన్నీ విషపదార్థాలే.
ఇన్ని విషాలు కలిసినవి కాబట్టే 6 సంవత్సరాల లోపు పిల్లలు తాగరాదని విదేశాల్లో అమ్మబడే కూల్ డ్రింక్ సీసాలపై ఒక హెచ్చరిక కూడా రాసుంటుంది. కాని మన దేశంలో ఇలా రాయటం లేదు. ఇదీ మన ప్రజల ఆరోగ్యంపట్ల మన ప్రభుత్వాలకున్న శ్రద్దను తెలియజేస్తుంది .
అసలు కూల్ డ్రింకుల అమ్మకాన్నే బ్యాన్ చేయమని అందరం ఉద్యమించాలి. ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి. అప్పటి వరకు ప్రదలే స్వచ్ఛందంగా కూల్ డ్రింకులు తాగడాన్ని బహిష్కరించాలి. మేము కూల్ డ్రిమకులు తాగం.. మీరూ తాగకండి అని మనకు తెలిసిన వాల్లందరనీ చైతన్య పరుచాలి.
– సి. రామ రాజు జన విజ్ఞాన వేదిక తెలంగాణ