వికలాంగుల కోటా మోసం కేసు!
డాక్టర్ కావాలని కాలు నరుక్కున్నాడు
మోసం కేసులో జైల్ లో ఉన్నాడు..
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాకు చెందిన ఇరువై నాలుగేళ్ల నిట్ అభ్యర్థి సూరజ్ భాస్కర్ అతి తెలివిని ప్రదర్శించి జైల్ లో గడుపుతున్నాడు. ఎలాగైనా డాక్టర్ కావాలని భావించిన అతను వికలాంగుల కోటాలో ఎంబీబీఎస్ సీటు కోసం ఏకంగా కాలు నరుక్కొని వికలాంగుడి సర్టిఫికెట్ సంపాదించాడు. కానీ.. పోలీసుల విచారణలో నిజాలు బయట పడటంతో జైల్ లో ఊచలు లెక్కిచస్తున్నాడు సూరజ్ భాస్కర్.
(యాటకర్ల మల్లేష్)
సూరజ్ భాస్కర్ కు డాక్టర్ కావాలనేది జీవిత కల.. అప్పటికే రెండు పర్యాయాలు నిట్ ఎగ్జామ్ రాసిన ఎంబీబీఎస్ సీటు సాధ్యం కాకపోవడంతో అడ్డ దారులోనైనా సీటు సాధించాలని వ్యూహం రూపొందించుకున్నారు. అయితే.. దివ్యాంగుల కోటా కింద సీటు దొరకాలనే ఆశతో స్వయంగా తన ఎడమ కాలు భాగాన్ని నరికివేశాడు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
సూరజ్ ఏమి చేశాడు..?
- సూరజ్ గతంలో నీట్ లో రెండుసార్లు విఫలమైన తర్వాత, వికలాంగుల కోటా ద్వారా మెడికల్ సీటు పొందాలని నిర్ణయించుకున్నాడు.
- దివ్యాంగ సర్టిఫికేట్ పొందడానికి పోలీసు నివేదిక తప్పనిసరి కావడంతో… అతడు తనపై “గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కాలు నరికివేశారు” అని ఫిర్యాదు చేశాడు.
- పోలీసులు మొదట కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ అతని వాంగ్మూలాల్లో అసమానతలు, కాల్ రికార్డులు, స్నేహితురాలి విచారణ తర్వాత నిజాలు బయటపడ్డాయి.
పోలీసుల దర్యాప్తులో బయట పడిన నిజాలు..
- సూరజ్ ఇంట్లో అనస్థీషియా సిరంజిలు, శస్త్రచికిత్సా సాధనాలు (స్వయంగా గాయం చేసుకోవడానికి ఉపయోగించినవి) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- గతంలో కూడా అన్యాయమైన మార్గాల్లో దివ్యాంగ సర్టిఫికేట్ ప్రయత్నించినట్లు సమాచారం.
- ఇప్పుడు అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తదుపరి చట్టపరమైన చర్యలు (మోసం, స్వీయ-గాయపరచుకోవడం, పోలీసులను మోసం చేయడం) తీసుకునే అవకాశం ఉంది.
ఫోటో చెబుతున్న కథ
ఆసుపత్రి బెడ్‌పై కూర్చుని ఉన్న సూరజ్… కాలుపై పెద్ద ప్లాస్టర్, గాయం తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ ఫోటో చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. కానీ ఇది స్వయంగా చేసుకున్న దుర్మార్గం అని తెలిస్తే మరింత ఆందోళన కలుగుతుంది.
ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు – సమాజానికి హెచ్చరిక!
- నీట్ పరీక్షల్లో పోటీ ఎంత తీవ్రంగా ఉందో, కొందరు ఎంత దారుణమైన మార్గాలకు దిగుతున్నారో ఇది చూపిస్తోంది.
- వికలాంగుల కోటా నిజమైన దివ్యాంగులకు సహాయపడాల్సింది. కానీ మోసాల వల్ల అది కూడా ప్రశ్నార్థకం అవుతోంది.
- ఒక వైద్యుడి కల… కానీ దాని కోసం స్వంత శరీరాన్నే త్యాగం చేసుకోవడం వినాశకరం. ఇలాంటి సంఘటనలు మనసు కదిలించాలి. విద్య, కెరీర్ కోసం సరైన మార్గంలో ప్రయత్నించాలని, ఒత్తిడికి లొంగకూడదని గుర్తుచేస్తాయి.





