టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి లొల్లి..
సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పి
- మాజీ డీజీపీ వద్దంటున్న జనం
- నిజాయితీ, విద్యావేత్తను నియమించాలని డిమాండ్
- రెడ్డి సామాజిక వర్గానికి సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారనే టాక్..
కాంగ్రెస్ ప్రభుత్వంలో లొల్లి షురువయ్యింది. రాజ్యాంగబద్ధమైన టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని నిజాయితీ గల విద్యావేత్తకు ఇవ్వాలని డిమాండ్ పెరిగింది. ఇప్పటికే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించనున్నారనే వార్తలతో జనం భగ్గుమంటున్నారు. సోషల్ మీడియా కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నారు. వివాదాస్పదుడైన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి ఎలా ఇస్తారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజాయితీ, విద్యావేత్తను నియమించాలని..
వివాదాలకు అతీతంగా నిజాయితీగా విధులు నిర్వహించే విద్యావేత్తలకు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని అప్పగిస్తే లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందనే టాక్ ఉంది. ఇప్పటికే సెర్చ్ కమిటీ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపినట్లు వార్తలు వచ్చాయి. గత ప్రభుత్వంలో వివాదస్పదమైన టీఎస్పీఎస్సీ చైర్మన్ అండ్ కమిటీ సభ్యుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకుంటే ప్రజలలో వ్యతిరేక భావం పెరుగుతుందంటున్నారు విద్యావేత్తలు.
పిఎంఆర్ యూ ట్యూబుల్ టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిపై విద్యార్థుల ఆవేదన వీడియో లింక్..
ఇప్పటికే రెండు రోజులుగా టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం విషయమై నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. మహేందర్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ గా విధులు నిర్వహించిన సందర్భంలో వివాదాస్పదుడిగా మిగిలి పోయారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేందర్ రెడ్డిపై ప్రత్యేకంగా ఇంటిలిజెన్స్ వింగ్ తో విచారణ జరిపిస్తే చాలా విషయాలు బహిర్గతం అవుతాయంటున్నారు.
మైక్ టీవీ న్యూస్ లో విద్యావేత్త అశోక్ ఇంటార్వ్యూ వీడియో లింక్
సర్వేలన్నీ మాజీ డీజీపీకి వ్యతిరేకం..
టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించే విషయంలో యూట్యూబ్ లతో పాటు ఆర్ టీవీ ప్రజాభిప్రాయం సేకరించింది. అన్ని సర్వేలు అతనికి వ్యతిరేకంగా వచ్చాయి. క్యూ న్యూస్, మైక్ టీవీ, ఆర్ టీవీ మన తొలివెలుగు, కాళోజీ టీవీ ఇలా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ లలో కూడా డిబెట్ పెడితే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని వ్యతిరేకించారు.
ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్