రాంగ్ రూట్ లో వాకింగ్ చేయాలి..
- ప్రజలకు అవగహన కల్పిస్తున్న డాక్టర్
నిర్దేశం, హైదరాబాద్ :
ఔను.. మీరు రాంగ్ రూట్ లోనే వాకింగ్ చేయాలి.. అప్పుడే మీరు క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకుంటారని చెబుతున్నారు ప్రముఖ ఆర్డోపెడిక్ వైద్యులు శరత్ చంద్ర. ఎవరైనా రోడ్ పై ఎడమ వైపు నుంచి వెళుతారు.. అలా వెళ్లడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహణాలు ఢీ కొని మరణించిన సంఘటనలు ఉన్నాయన్నారు ఆయన.
హైదరాబాద్ నగరం లంగర్ హౌజ్ ప్రాంతంలో ఉదయం వాకింగ్ చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారని డాక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ కు ఎడమ వైపు నడువడం వల్ల వెనుక నుంచి వాహనం వస్తున్నట్లు వాకర్స్ గుర్తించలేరన్నారు ఆయన.
వాహనం ఢీ కొనడానికి రోడ్ పై వారు కుడి వైపున వాకింగ్ చేయక పోవడమేనని వివరించారు. అయితే.. రోడ్ పై కుడి వైపు మాత్రమే వాకింగ్ చేయడం గురించి ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు అవగహన కల్పించాలని డాక్టర్ శరత్ చంద్ర వివరించారు.
కిడ్నీలు ఫెయిలైనావని..
బ్యాక్ ఫెయిన్ రాగానే కిడ్నీలు ఫెయిల్ అయినట్లు కొందరు వైద్యులు ప్రజలకు రాంగ్ మెస్సెజ్ పంపతున్నారని డాక్టర్ శరత్ చంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాక్ ఫెయిన్ వచ్చిన వారిలో 1 శాతం మాత్రమే కిడ్నీల సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు ఆయన. ముఖ్యంగా యుట్యూబ్ లలో చూసి వైద్య సలహాలు తీసుకుని రోగ నిర్దారణ చేసుకుంటున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చిందన్నారు. వైద్యులను సంప్రదించి వారి సలహాల మేరకు రోగి చికిత్స తీసుకోవాలని కోరారు డాక్టర్ శరత్ చంద్ర.
– యాటకర్ల మల్లేష్