మోసాల మొనగాడు గోల్డ్‌ ఫిష్‌ సంస్థ అధినేత చంద్రశేఖర్‌ వేగే అరెస్ట్

మోసాల మొనగాడు

  • గోల్డ్‌ ఫిష్‌ సంస్థ అధినేత చంద్రశేఖర్‌ వేగే అరెస్ట్

  • విల్లాల పేరుతో ప్రముఖులకు టోకరా..

  • పేరుకే ‘రియల్’ వ్యాపారం.. చేసేవన్నీ క్రిమినల్ పనులే..

  • ఇది వరకే పీడీ యాక్ట్ కేసులో అరెస్ట్..About us – Society for Cyberabad Security Council [SCSC]

చట్టం ఎవరికి చుట్టం కాదు.. నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ లు ఎదురు పడితే తప్పు చేసినవారేవరైనా కటకటాలు లెక్కించాల్సిందే. ఇగో.. గోల్డ్‌ ఫిష్‌ సంస్థ అధినేత చంద్రశేఖర్‌ వేగే చేసిన మోసాలపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సీరియస్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో తాను చేసిన అక్రమాల చిట్టను వెలికి తీసి ఆయనను అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఈవోడబ్లు (ఎకనమిక్స్ అఫెన్స్ వింగ్) అధికారులు.  

మోసాలకు కేరాఫ్ అడ్రసు..

గోల్డ్‌ ఫిష్‌ సంస్థ అధినేత చంద్రశేఖర్‌ వేగే అలియాస్‌ చందు మోసాలకు కేరాఫ్ అడ్రసు.. తియ్యని మాటలతో ఎదుటి వ్యక్తులను బురద కొట్టడంలో ఆయనను మించినోడు మరోడు లేడు. కేసీఆర్ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే అండతో తాను కోట్లు ఆర్జించారు. అక్రమంగా డబ్బుల సంపాదన కోసం క్రిమినల్ పనులు చేయడానికి ఎప్పుడు కూడా వెనుకాడని ఘనుడు ఆయన.

అంతా క్రిమినల్ చరిత్రనే..
చంద్రశేఖర్‌ వేగే అలియాస్‌ చందుది అంతా క్రిమినల్ చరిత్రనే. కిడ్నాప్‌.. బ్లాక్‌ మెయిలింగ్‌.. షేర్ల బదిలింపు కేసులలో ఆయన పాత్రను పోలీసులు గుర్తించారు. అవకాశం దొరికితే చాలు అక్రమంగా ఆస్తులు సంపాదించడానికి క్రిమినల్ చర్యలకు పాల్పాడుతాడు. జూబ్లీహిల్స్‌లోని క్రియా హెల్త్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంబంధించి బలవంతంగా షేర్లమార్పు, యాజమాన్య  మార్పిడి వ్యవహరంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలకంగా వ్యవహరించిన టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ రాధకిషన్‌ రావు, డిఎస్పీ గట్టు మల్లు, మల్లికార్జున్‌, క్రిష్ణ, గోపాల్‌, రాజు, రవి, బాలాజీ లతో పాటు గోల్డ్‌ ఫిష్‌ సంస్థ చంద్రశేఖర్‌ వేగేల పేరు తెరపైకి వచ్చింది.

క్రిమినల్ కేసులలో జైలు శిక్షలు..

చంద్రశేఖర్‌ వేగే అలియాస్‌ చందు ఎంజాయ్ పురుషుడు.. ఒకరికి తెలియకుండా మరోకరిని ఇలా ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు ఈ చందు. ఆయనపై భార్యలు సైతం తమకు అన్యాయం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన చరిత్ర ఆయన సొంతం. రాయదుర్గం వద్ద గల మల్కాం చెరువు కబ్జా చేశాడని ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో చంద్రశేఖర్‌ వేగేను పోలీసులు అరెస్టు చేసారు. ఆ కేసులో కోర్టు ఆయనకు జైలు శిక్ష కూడా విదించింది. మెదక్‌ బీఆర్‌ ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిస వెంకట్రామ్‌ రెడ్డి, మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డి భూమిని కబ్జా చేసాడనే ఆరోపణలు ఉన్నాయి.

విల్లాల పేరుతో మోసం…

కోకాపేట, మంచి రేవుల ప్రాంతాలలో గోల్డ్‌ ఫిష్‌ అబోడ్‌ కంపెనీ ఆధ్వర్యంలో విల్లాల నిర్మాణం చేపట్టాడు చంద్రశేఖర్‌. క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్‌, అతని మేనేజర్‌ శ్రీకాంత్‌, సాప్ట్‌ వెర్‌ కంపెనీ యాజమాని సంజయ్‌ కామ్టం, సినీ హీరో ప్రభాస్‌ సోదరుడు సత్యనారాయణ రాజు అలియాస్‌ సందీప్‌, హైకోర్టు లాయర్‌లకు విల్లాలలను విక్రయించింది గోల్డ్‌ ఫిష్‌ అబోడ్‌ కంపెనీ. అయితే.. ధరలు పెరిగి నందున అదనంగా డబ్బులు ఇవ్వాలని విల్లాలను అప్పగించకుండా మోసం చేసిన చరిత్ర ఆయన సొంతం. చంద్రశేఖర్‌పై సీటింగ్‌ కేసులు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు తమిళనాడు – కేరళ మధ్యలో గల మున్నారు ఫారెస్ట్‌ లోని రిసార్ట్‌లో ఆయనను అరెస్టు చేశారు.

చందుపై పీడీ యాక్ట్ పెట్టినా..

గోల్డ్‌ ఫిష్‌ సంస్థ అధినేత చంద్రశేఖర్‌ వేగే అలియాస్‌ చందుపై కేసీఆర్ ప్రభుత్వంలో నార్సింగ్ పోలీసులు పీడీ యాక్ట్ కేసు పెట్టారు. ఆయన వల్ల సాదారణ చట్టాలతో క్రిమినల్స్‌ ను అరికట్టలేనప్పుడు.. ఆయనతో సమాజానికి నష్టం అని భావించినప్పుడు ప్రివెంటివ్‌ అండ్‌ డిటెన్షన్‌  చట్టాన్ని ఉపయోగించి నేరాలు జరుగ కుండా చూస్తారు పోలీసులు. కానీ.. గోల్డ్‌ ఫిష్‌ సంస్థ అధినేత చంద్రశేఖర్‌ వేగే అలియాస్‌ చందు కేసీఆర్ ప్రభుత్వంలో అధికార పార్టీ అండతో చట్టాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. అందులో భాగంగానే చందు తనపై పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ ను తొలగించుకోవడం విశేషం. మొదట ఎలాంటి పనినైనా ప్రేమతో చేసుకుంటాడు. ఒకవేళ ఎదుటి వ్యక్తి వినక పోతే ఎంత దూరమైన వెళ్లడానికి వెనుకాడడు అనే టాక్ ఉంది. ఏది ఏమైనా సైబరాబాద్ ఈవోడబ్లు (ఎకనమిక్స్ అఫెన్స్ వింగ్) అధికారులు గోల్డ్‌ ఫిష్‌ సంస్థ అధినేత చంద్రశేఖర్‌ వేగే అలియాస్‌ చందును అరెస్టు చేయడం పట్ల బాధితులు హర్షం వక్తం చేస్తున్నారు.

యాటకర్ల మల్లేష్

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!