కులాల పేరా.. మతాల పేరా అగ్రవర్గాల కింద అనచబడుతూ సమాజంలో సమానత్వం లేక పీడనకు గురవుతూ ఎదురీదుతున్న సమాజం ఒక వైపు.. నీవు తినే తిండిపై నువ్వు కట్టుకునే బట్టపై.. నువ్వు మాట్లాడే మాటపై ఆంక్షలు విధిస్తూ... లౌకిక రాజ్యమనే మాటను మరచి మతాల మధ్య చిచ్చుపెట్టి.. ప్రజలను వేరు చేసి భావప్రకటన స్వేచ్ఛను హరిస్తూ దాడులు చేసే సందర్భం మరొక వైపు..