మహిళల రక్షణకు పటిష్ట చర్యలు
రెండు తెలుగు రాష్టాల్ల్రో ప్రత్యేక దృష్టి
మహిళల రక్షణలో ముందున్న టీమ్స్
హైదరాబాద్, నిర్దేశం :
ఇప్పుడు ఎక్కువగా సైబర్ కైమ్ర్ ఫ్రాడ్ సోషల్ విూడియా వేదికగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా జాగ్రత్తగా ఉండాలని ఏదైనా సమస్య వస్తే వెంటనే మా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి… ఇప్పుడు మహిళలకు అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. తెలంగాణలో మహిళల రక్షణకు షీ టీమ్స్ ఏర్పాటు చేశాక మంచి ఫలితాలు వస్తున్నాయి. మహిళలకు అండగా అవి బాగా పనిచేస్తున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలతో చైతన్యం చేపట్టారు. ఎపిలోనూ మహిళా శక్తి యాప్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తామని హోంమంత్రి అనిత ప్రకటించారు. గతంతో పోలిస్తే మహిళల రోణ విషయంలో ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా ఒకే తరహా కఠిన చట్టాలు రావాలి. అప్పుడే ప్రజల్లో భయం నెలకొంటుంది. ఇకపోతే షీ టీమ్స్ ఏర్పాటు చేసినప్పుడు దీనిని బలోపేతం చేసి మహిళలకు అండగా నిలవడంలో ఐపిఎస్ అధికారి స్వాతి లక్రా కృషి ప్రశంసనీయం. సిటీ పోలీస్ తరపున షీటీమ్స్ బాగా పనిచేయడంతో అనేక రాష్టాల్ల్రో దీనిని విస్తరించారు. ఇదో రకంగా తెలంగాణ షీ టీమ్స్‌కు దక్కిన గౌరవంగా చూడాలి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు. షీటీమ్స్ ఏర్పడినందున వారి పాత్రను,కృషిని అభినందించాల్సిందే. ఎన్నో క్లిష్లమైన సమస్యలను, కేసులను పరిష్కరించడంతో పాటు..మహిళలకు తామున్నామన్న భరోసా ఇవ్వడంలో షీ టీమ్స్ విజయం సాధించాయి. డయల్ 100, మహిళా భద్రత, షీ టీమ్స్ గురించి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు. ఉమెన్ సేప్టీ విషయంలో అనేక చర్యలు తీసుకున్నారు. మహిళలను వేధించినా లేదా రేప్ కేసుల్లో నిందితులకు శిక్ష ఖరారు చేయించడంలో షీటీమ్స్ కీలక భూమిక పోషించాయి. యువతులు, మహిళలు ఇక నగరంలో నిర్భయంగా ఉండొచ్చన్న భరోసా దక్కడంలో ఈ టీమ్స్ బాగా కృషి చేస్తున్నాయి. వారికి అండగా, రక్షణగా ’షి’ బృందాలను ఏర్పాటు చేసి వారి భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసింది. జగన్ హయాంలో మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినా లితంలేకుండా పోయింది. ప్రధానంగా మహిళల పట్ల సమాజంలో మార్పు వస్తేనే ఇది సాధ్యం. బస్టాపులు, రైల్వేస్టేషన్లు, ఆటోస్టాండ్ల వద్ద, కళాశాలల వద్ద నిఘా వేస్తారు. మహిళలను వేధింపులకు గురి చేసిన వారిని తక్షణమే అదుపులోకి తీసుకుంటున్నారు. ఆపదలో ఉన్నప్పుడు వెంటనే 100కు ఫోన్ చేస్తే తక్షణ సాయం అందిస్తామని స్వాతిలక్రా మహిళలకు సూచించారు. ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతూ షి బృందాలకు పట్టుబడిన వారు జాగ్రత్తగా ఉండకపోతే వారిపై కైమ్ర్షీట్ తెరుస్తారు. ఆ వివరాలు అన్ని పోలీస్స్టేషన్లలో అందుబాటులో ఉండేలా సెంట్రల్ డేటాలో పొందుపరుస్తారు. ఈవ్టీజర్ల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తారు. చట్ట ప్రకారం శిక్షించడమే కాకుండా, మళ్లీ పట్టుబడితే నిర్భయ కేసును నమోదు చేస్తారు.