జాతీయ స్థాయిలో సత్తా చాటిన గిరి పుత్రుడు .

జాతీయ స్థాయిలో సత్తా చాటిన గిరి పుత్రుడు .

ఘనంగా సన్మానించిన మణుగూరు నేతాజీ వాకర్స్ టీమ్.

మణుగూరు, నిర్దేశం:
జాతీయ స్థాయి అథ్లెటిక్ క్రీడాకారుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం మారాయి గూడెం గ్రామానికి చెందిన అపక సతీష్ కి కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు లో మార్చి 4 నుండి 9 వరకు మాస్టర్స్ అథ్లెటిక్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా ( MAFI ) ఆధ్వర్యంలో నిర్వహించిన రన్నింగ్ పోటీలో 100 మీటర్ల రన్నింగ్ విభాగంలో మూడవ స్థాయిలో నిలిచి కాంస్య పతకం గెలిపొందడం జరిగింది.
మణుగూరు కి చెందిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాకర్స్ టీమ్ సభ్యులు ఫిబ్రవరి 23 న అపక సతీష్ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని  బెంగుళూరు వెళ్ళడానికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినందుకు గాను కృతజ్ఞతతో మణుగూరు వచ్చి వారిని
కలవడం జరిగింది. ఈ సందర్భంగా నేతాజీ వాకర్స్ టీమ్ సభ్యులు శ్రీ భార్గవ ఆటోమొబైల్స్ హీరో షో రూమ్ అధినేత N. విజయ భాస్కర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ రావులపల్లి రామమూర్తి, BRS సీనియర్ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో అపక సతీష్ కి పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపక సతీష్ మన ప్రాంతం నుండి జాతీయ స్థాయి పోటీలో పాల్గొని వేలాది మందిలో   మూడవ స్థానంలో కాంస్య పతకం గెలవడం చాలా గర్వంగా ఉందని,ఇటువంటి పేద యువకులను ప్రోత్సహించడం మన అందరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్ లో జరిగే ఇంటర్నేషనల్ పోటీలకు సెలక్ట్ కావడం చాలా సంతోషంగా ఉందని, అక్కడ కూడా పాల్గొని మరిన్ని పథకాలు సాధించి మన ప్రాంతానికి,మన జిల్లాకు,మన రాష్టానికి,దేశానికీ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అపక సతీష్ కి నేతాజీ వాకర్స్ టీమ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో నేతాజీ వాకర్స్ టీమ్ సబ్యులు సామ శ్రీనివాసరెడ్డి, వడ్డాణం రమేష్,జొన్నలగడ్డ వెంకటేశ్వరావు,శంకర్ రెడ్డి,వాగబోయిన నాగేశ్వరరావు,శంకర్,వంగా సంతోష్,కాంపాటి ప్రసాద్,కొరిమిల్ల శ్రీనివాస్,కనుకు రమేష్,ఆర్,సుమన్,రామిరెడ్డి,అలవాల రాంబాబు,అమర కిరణ్,కాంట్రాక్టర్ రామకృష్ణ, బాబురావు,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »