దేశానికి గర్వకారణం మహిళా క్రీడాకారులు
భారత కీర్తిపతాకను ఎగరేసతున్నవారు ఎందరో
త్రిష లాంటి వారికి మరింత ప్రోత్సాహం దక్కాలి
న్యూఢల్లీ, నిర్దేశం :
క్రీడా రంగంలో ఇటీవలే తెలంగాణకు చెందిన గొంగడి త్రిష తారాజువ్వలా దూసుకుని వచ్చారు. తన స్వయంకృషితో ఆమె అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించారు. క్రీడారంగంలో మెరుపులు పూయిస్తున్న ఎందరో మహిళా క్రీడాకారులు భారత కీర్తిపతాకాన్ని ఎగురవేశారు. సానియా విూర్జా,సైనా నెహ్వాల్, పివి సింధు, మేరీ కోమ్,స్మృతి మందాన వంటి వారు ప్రస్తుత సమాజంలో ఇంకా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. వారు క్రీడారంగంలో చేస్తున్న కృషి భారత ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. క్రికెట్‌లో కూడా తమకు ఎదురు లేదని చూపుతున్నారు. ఇందులో తెలుగమ్మాయి పివి సింధు ఎన్నో అద్భుతాలతో రాణించి పద్మశ్రీని దక్కించుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసిన పి.వి.సింధు కృషి అభినందనీయం.
ఆమె ఎలాంటి ప్రోత్సాహం లేకుండానే రాకెట్ పట్టి ఎంతో కఠిన దీక్షతో ఈ దశకు చేరుకుంది.ఈ యజ్ఞంలో ఆమె ఎక్కడా తడబాటుకు గురికాకుండా, ఆత్మస్థయిర్యం కోల్పోకుండా అప్రతిహతంగా ముందుకు సాగిన తీరు అభినందనీయం. ఇంతటి ఘనకీర్తి సాధించడానికి వ్యక్తిగతంగా ఆమె కష్టపడితే ఆమె కష్టానికి తల్లిదండ్రు లు, కోచ్ పుల్లెల గోపీచంద్ తోడ్పడ్డారు. అయితే ఆర్థికంగా కూడా ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ లో పోటీపడినా స్వర్ణం గెలవడం సింధుకు మరచిపోలేని అనుభూతిగా మిగిలింది. పక్కా ప్రణాళికతో సిద్ధమై అనుకున్నది సాధించి, విశ్వకిరీటాన్ని అందుకొన్న తొలి భారత క్రీడాకారిణిగా గణుతి కెక్కింది. ’రియో’తో మొదలైన జోరును ఇంకా కొనసాగిస్తున్న సింధు ప్రపంచ టోర్నీ స్వర్ణంతో తన స్థాయిని మరింత పెంచుకుంది. అయితే ఒలంపిక్స్ పట్టికలో మనం ఎప్పుడూ కింది నుంచి ఫస్ట్ ఉండడానికి ప్రయత్నిస్తున్నాం.
సింధులాంటి వారు పతకాలు సాధించారంటే అందులో ప్రభుత్వాల ఘనకార్యం ఏవిూ లేదు. త్రిష లాంటి వారు దూసుకు వచ్చినా వారి సొంత కస్టమే. కోనేరు హంపి ఇలా ఎందరో ఉన్నారు. వారు తమ సొంతంగా ఆట నేర్చుకుని మన పరవును నిలబెట్టేందుకు ప్రయత్నించారు. నిజానికి ముందునుంచే ప్రభుత్వాలు వీరిని ప్రోత్సహించి ఉంటే బంగారు కొండల్లా మెరిసేవారు. బేఠీ బచావో..బేఠీ పడావో నినాదంగా మారరాదు. వీరి స్ఫూర్తిగా తీసుకుని ఆడపిల్లలకు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. ఆడపిల్లల క్రీడలకు, విద్యకు ఉచిత సౌకర్యాలు, మినహాయింపులు ఇవ్వాలి. అలా చేయడం ద్వారా ఎందరినో తయారు చేసుకోవాలి. త్రిష సాధించిన విజయంతో దేశంలో మహిళా క్రికెట్‌కు మరింత ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. సైనాకు తోడు సింధు, కశ్యప్, జ్వాల, అశ్విని లాంటి క్రీడాకారిణులు కూడా ప్రపంచ స్థాయికి ఎదగడంతో రాకెట్‌కు మరింత ఊపొచ్చింది.అలా అన్ని ప్రభుత్వాలు కూడాక్రీడాకారులను ప్రోత్సహించేలా నిర్ణయాలు ఉండాలి.