అధిపత్య పార్టీలకు ఓట్లు అమ్ముకోవద్దు
రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేయాలి
:బీఎస్ పీ నేత డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బహుజనులు రాజకీయ పోరాటానికి సిద్దం కావాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్లలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బహుజన మహనీయుల విగ్రహాలతో పాటు, బహుజనవాదం బలమైన శక్తిగా మారి,రాజకీయ ఉద్యమంగా మారితేనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని అన్నారు.
రాజ్యాధికారంతోనే బహుజనులు తలరాతలు మారతాయన్న ఆయన ఆ దిశగా రాజకీయంగా పోరాటాన్ని ఉధృతం చేయాలన్నారు.
రాజ్యాంగంలో కుల,మతాలకు అతీతంగా డా.బి.ఆర్.అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కును బీరు, బిర్యానీ,డబ్బులకు అమ్ముకోవద్దని కోరారు.
బీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాల ప్రజలు రాయితీలు,సంక్షేమ పథకాలకు రాజీపడి, ఆధిపత్య పార్టీలకు ఓట్లు వేయకుండా పేద వర్గాల సంక్షేమం కోసం పోరాడుతున్న బీఎస్పీకి ఓట్లు వేయాలన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, అగ్రకుల పేదల అభివృద్ధి కోసం బీఎస్పీ నిరంతరం పోరాడుతుందన్నారు.