Take a fresh look at your lifestyle.

ఆర్మూర్ ఈనాడు రిపోర్టర్ అశోక్ ఇక లేరు..

హార్ట్ అటాక్ తో ఆర్మూర్ ఈనాడు రిపోర్టర్ అశోక్ మృతి

0 2,981

ఆర్మూర్ ఈనాడు రిపోర్టర్ అశోక్ ఇక లేరు..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో సుదీర్ఘ కాలం రిపోర్టర్ గా పని చేసిన జీ. అశోక్ (56) సోమవారం అర్ధరాత్రి హార్ట్ అటాక్ తో మరణించారు. సోమవారం రాత్రి 8 గంటలకు చాతీలో నొప్పి రావడంతో లోకల్ డాక్టర్ అశోక్ వద్దకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు.

పరిస్థితి సీరియస్ గా ఉందని నిజామాబాద్ తీసుకెళ్లాలని ఆ వైద్యులు అడ్వాజ్ చేశారు. ఆ వెంటనే నిజామాబాద్ తీసుకెళ్లి చికిత్స చేయిస్తుంటే అర్ధరాత్రి మరణించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండే అశోక్ హార్ట్ అటాక్ తో మరిణించారంటే సన్నిహితులు నమ్మలేక పోతున్నారు. మద్యం లాంటి అలవాట్లు కూడా అతనికి లేవు.

జర్నలిస్ట్ గా అశోక్ జర్నీ..

నిజామాబాద్ నుంచి వెలువడే ‘‘పొద్దు’’ దిన పత్రికలో రిపోర్టర్ గా 1989లో జర్నలిజం వృత్తిలోకి అడుగు పెట్టారు. ఆ తరువాత 1990 ఈనాడు ఆర్మూర్ డివిజన్ రిపోర్టర్ గా కొత్త జర్నీ ప్రారంభించారు.

సుదీర్ఘ కాలం ఈనాడులో..

లీడింగ్ సర్క్యూలేషన్ ‘‘ఈనాడు’’ లో రిపోర్టర్ గా పని చేయడం వల్ల అతనికి ఆ ప్రాంతంలోని ప్రజలలో మంచి గుర్తింపు ఉంది. 35 ఏళ్లుగా జర్నలిస్ట్ గా పని చేసిన అశోక్ కు భార్య సుష్మా, ఇద్దరు కొడుకులు తేజా, అజీత్ ఉన్నారు.

జర్నలిస్ట్ గా అవినీతి, అక్రమాలపై ఎన్నో వార్త కథనాలు ఇచ్చే అశోక్ ఎప్పుడు మృధు స్వాభావంతో ఉండేవారు. వివాదాలకు దూరంగా ఉండే వారు. ఈనాడు విలేకరిగా ఉన్న క్రేజ్ తో చాలా మంది అతని వద్దకు వచ్చి మంచి చెడుల గురించి చర్చించేవారు. జర్నలిస్ట్ గా సాధ్యమైనంత వరకు మంచి సలహాలు ఇచ్చే వారు.

జర్నలిస్ట్ కాలోనిలో క్లీన్ అండ్ గ్రీన్..

జర్నలిస్ట్ కాలోని అభివృద్ది కమిటీ అధ్యక్షుడిగా అశోక్ ప్రతి ఆదివారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టి కాలోని వాసులను ఆ ప్రోగ్రాంలో ఇన్ వాల్వ్ చేసేవారు. ఈనెల 16వ తేదిన ఆదివారంకు 50 ప్రోగ్రాం కావడంతో లోకల్ కేవీ 9 న్యూస్ యూ ట్యూబ్ ఛానెల్ లో సీనియర్ రిపోర్టర్ కొండవీటి శ్యామ్  ప్రత్యేకంగా ప్రోగ్రాం అశోక్ క్లీన్ అండ్ గ్రీన్  గురించి ఇచ్చారు.

అంత్యక్రియలు..

జూన్ 18న (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు ఆర్మూర్ లోని జర్నలిస్ట్ కాలోనిలో గల తన ఇంటి నుంచి శవయాత్ర ప్రారంభం అవుతుంది.

ఈనాడు అశోెక్ తో నా జ్ఞాపకాలు మరిచి పోలేనివి. ఎప్పుడు బావ అంటూ పిలుచుకునే అశోక్ లేరనే వార్త నమ్మలేని నిజం. పొద్దున్నేనిజామాబాద్ ఆంధ్రప్రభ బ్యూరో ఇన్ చార్జీ నర్సింహా చారి ఫోన్ చేయడంతో ఏదో బ్యాడ్ న్యూస్ అనుకుంటునే మాట్లాడాను. కానీ.. అశోక్ మరణించారనే వార్త నా హృదయాన్ని కదిలించింది. చాలా కాలం చారి, సాతేపూతే శ్రీనివాస్, మ్యాకల నరేందర్, హన్మంత్ రెడ్డి, కమ్ముల గంగాధర్ లతో కలిసి ఆర్మూర్ డివిజన్ రిపోర్టర్ లుగా పని చేశాం.

అశోక్ బావ.. నీవు లేక పోవచ్చు.. కానీ..  జ్ఞాపకాలు మా వెంటే ఉంటాయి.. నీ ఆత్మకు శాంతి కలుగాలని కోరుతూ…

– యాటకర్ల మల్లేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking