కులాన్ని బట్టి కంచంలో ప్రొటీన్లు.. పచ్చి నిజాలు బయటపెట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే

నిర్దేశం, హైదరాబాద్: మన దేశంలో ఆహారం అనేది కేవలం కడుపు నింపుకునేదే కాదు.. మన సమాజంలోని సంప్రదాయాలకు, విపక్షకు ఒక బలమైన పునాది. ఒకడు బీఫ్ తింటున్నాడు అంటే.. వాడి కులమేంటో ఇట్టే చెప్పేస్తారు. అయితే తినడాన్ని బట్టి చెప్పడం అటుంచితే. అసలు కులాన్ని బట్టే ప్రజలకు పోషకాలు అందుతున్నాయంటే నమ్మగలరా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‭హెచ్ఎస్-5) ఇచ్చిన ఈ డేటాలో ఆ కడుపు కోతను కళ్లకు చూపించారు.

గుడ్లు, చేపలు, మాంసం వంటి పోషక ఆహారాలు అందరికీ సమానంగా అందడం లేదు. సమాజంలోని బలహీన వర్గాల నుంచి వచ్చే ప్రజలు తరచుగా ఈ పోషకాహారాన్ని సరిపడా పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితికి కారణం పేదరికమే అనుకుంటే పొరపాటే. సమాజంలో లోతుగా పాతుకుపోయిన కుల అసమానతలు, వివక్షల ఫలితం చాలా పెద్దగానే ఉంది.

సమతుల్య ఆహారం అంటే ఏమిటి?

సమతుల్య ఆహారం అనేది శారీరక అవసరాలను తీర్చడానికి సరైన పరిమాణంలో అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. సమతుల్య ఆహారం మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శక్తివంతంగా కూడా ఉంచుతుంది.

కులాల వారీగా ప్రొటీన్ ఫుడ్ వివరాలు..

భారతదేశంలోని కోట్లాది మంది మహిళలు ఇప్పటికీ ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని పొందలేకపోతున్నారు. ఎన్ఎఫ్‭హెచ్ఎస్-5 డేటా ప్రకారం.. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) స్త్రీలలో కేవలం 48.4 శాతం మంది మాత్రమే వారానికి ఒక గుడ్డు తీసుకుంటున్నారు. ఇక చేపలు కేవలం 37.4 శాతం మంది మహిళలు మాత్రమే అందుతోంది. 37.7 శాతం మంది మహిళలు కనీసం వారానికి ఒకసారి చికెన్ లేదా మాంసాన్ని తీసుకుంటున్నారు.

ఇక షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) మహిళల విషయానికి వస్తే.. 46.4 శాతం మంది మహిళలు మాత్రమే గుడ్లు తింటున్నారు. 36 శాతం మంది మహిళలు వారానికి ఒకసారి చేపలు తింటున్నారు. ఎస్సీ, ఎస్టీల కంటే వెనుకబడిన కులాలు (బీసీ) మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. కేవలం 32.4 శాతం బీసీ మహిళలే చేపలు తింటున్నారు. 33.7 శాతం మహిళలు చికెన్ లేదా మాంసం వారానికి ఒకసారి అందుతోంది.

నిజానికి ఈ గణాంకాలు అసహ్యకరమైన వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి. నేటికీ మన దేశంలోని చాలా మంది స్త్రీలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి ఆహార ఎంపికపై ఆర్థిక భారంతో పాటు సామాజిక అసమానతలు కూడా కారణం అవుతున్నాయని అర్థమవుతోంది.

ఆహారానికి లింగ వివక్ష కూడా ఉంది

ఎన్ఎఫ్‭హెచ్ఎస్-5 డేటా ప్రకారం.. ఎస్సీ-ఎస్టీ-ఓబీసీ మహిళలతో పోలిస్తే ఈ కులాల పురుషుల కంచం కాస్త ఎక్కువ ప్రొటీన్‌ తోనే నిండుతోంది. 60.8 శాతం మంది పురుషులు కనీసం వారానికి ఒకసారి గుడ్లు తింటున్నారు. అయితే మహిళల్లో ఈ సంఖ్య 48.4 శాతం మాత్రమే. అదేవిధంగా చేపలు, మాంసం విషయంలో కూడా ఇదే తేడా ఉంది. పండుగల సమయంలో మాంసాహారం అమ్మడం లేదా కొనడం నిషేధించడం వంటి డిమాండ్లు వచ్చినప్పుడు ఆహార వినియోగంలో కులాల అంతరం మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది.

ప్రజలకు పౌష్టికాహారం ఎందుకు అందడం లేదు?

భారతదేశంలోని ప్రజలు పౌష్టికాహారాన్ని పొందలేకపోవడానికి అనేక కారణాలున్నాయి. పేద కుటుంబాలకు తగినంత డబ్బు లేదు. దీంతో తక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఇది కాకుండా, భారతదేశంలోని చాలా కుటుంబాలలో పోషకాహారంపై అవగాహన లేదు. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో ఆరోగ్యం, పోషకాహార విద్య కొరత ఉంది. అనేక గ్రామీణ ప్రాంతాలకు సరైన రవాణా, నిల్వ వంటి సౌకర్యాలు లేవు. దీంతో పౌష్టికాహారాల రవాణా జరగడం లేదు.

ఇది కాకుండా సాంస్కృతిక, మతపరమైన కారణాల వల్ల కూడా కొందరికి పౌష్టిక ఆహారం అందడం లేదు. కులం ఆధారంగా ఆహార నాణ్యత, లభ్యతలో వివక్ష ఉంది. కొన్ని కొనుక్కునే సామర్థ్యం ఉండదు, అలాగే కొన్ని దొరికినా కులం కారణంగా కొనలేరు. ఇందుకే కొంతమందికి పౌష్టికాహారం పొందడం కష్టమవుతోంది.

– టోనీ బెక్కల్

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!